తప్పుడు వివరాలిచ్చే ఉద్యోగులపై సుప్రీం కోర్టు కీలక తీర్పు

-

ఉద్యోగ అర్హతకు సంబంధించి తప్పుడు వివరాలు సమర్పించేవారిపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. తమ ఫిట్‌నెస్‌/యోగ్యతపై తప్పుడు వివరాలు సమర్పిస్తూ..  వాస్తవాలను దాచిపెట్టేవారిని సర్వీసు నుంచి తొలగించొచ్చని స్పష్టం చేసింది. అబద్ధాలు చెప్పడం, వాస్తవాలను దాచడమన్నది వారి ప్రవర్తన తీరును సూచిస్తుందని పేర్కొంది.

ప్రధానంగా పోలీసు బలగాల నియామక ప్రక్రియల్లో ఆ వివరాలను నిశితంగా పరిశీలించాల్సిన ఆవశ్యకతను సుప్రీం కోర్టు నొక్కిచెప్పింది. తనపై ఉన్న క్రిమినల్‌ కేసుకు సంబంధించి అభ్యర్థి సరైన సమాచారాన్ని అందించినంత మాత్రాన తనను ఉద్యోగంలోకి తీసుకోవాలని బలవంతం చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.

గతంలో ఉన్న కేసుల ఆధారంగా ఆ వ్యక్తి ప్రవర్తన శైలిని అంచనా వేసి ఉద్యోగానికి యోగ్యుడో కాదో యాజమాన్యం నిర్ధారించుకోవచ్చని తెలిపింది. తమపై ఉన్న కేసుల వివరాలను దాచిపెట్టిన ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. ఈ తరహా కేసుల్లో ఎలాంటి సూత్రాలను వర్తింపజేయాలన్న దానిపై కూడా జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం కీలక మార్గదర్శకాలను వెలువరించింది.

Read more RELATED
Recommended to you

Latest news