బింబిసార ఓటీటీ డేట్ ఫిక్స్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే !

-

హీరో కల్యామ్​రామ్​ నటించిన ‘బింబిసార’ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్​ వద్ద మంచి వసూళ్లను అందుకుంది. బింబిసారా చిత్రం భారీ అంచనాల మధ్య ఆగస్టు 5న గ్రాండ్ గా రిలీజ్ అయింది. విడుదలైన తొలి షో నుంచే ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో కళ్యాణ్ రామ్ సరికొత్త లుక్ లో కనిపించాడు.

బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను జీ5 ఓటీటీ దక్కించుకున్నది. తోలుత సెప్టెంబర్ నెలలోనే ఈ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ థియేటర్స్ లో వచ్చిన రెస్పాన్స్ కారణంగా ఆలస్యంగా ఓటీటీలో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దసరా సందర్భంగా అక్టోబర్ 7న ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్ పై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news