సుప్రీంకోర్టు హెచ్చరిక.. ప్రతీకారం తీర్చుకునేలా బుల్డోజర్ల కూల్చివేతలు!

-

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న బుల్డోజర్ విధానంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కూల్చివేతలు చట్టానికి లోబడి ఉండాలని, అవి ప్రతీకారం తీర్చుకునేలా ఉండకూడదని స్పష్టం చేసింది. కాగా, ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన ఘర్షణల్లో భాగంగా నిందితుల ఇళ్లు కూల్చివేయడంపై పిటిషన్ దాఖలైంది. ఈ వాదనను విన్న సుప్రీంకోర్టు.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయితే, ఇళ్ల కూల్చివేతలు నిలిపివేయాలని మాత్రం ఆదేశాలు ఇవ్వలేదు.

Supreme Court
Supreme Court

చట్టబద్ధంగా కట్టిన ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారని జమియత్ ఉలామా-ఇ-హింద్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. చట్టబద్ధమైన ప్రక్రియకు విరుద్ధంగా కూల్చివేతలు జరగకుండా చూసేలా కోర్టు ఉత్తరప్రదేశ్‌ను కోరింది. ఈ మేరకు పిటిషనర్ల తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ‘‘ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూల్చివేస్తున్నారు. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నారు.’ అని పేర్కొన్నారు. కాగా, ఈ విషయంపై సుప్రీంకోర్టు స్పందించింది. ఇళ్ల కూల్చివేతలు చట్టానికి లోబడి మాత్రమే ఉండాలన్నారు. ప్రతీకారం తీర్చుకునే విధంగా ఉండకూడదన్నారు. దీనిపై యూపీ ప్రభుత్వం మూడు రోజుల్లో అపిడవిట్ దాఖలు చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news