సురక్ష భీమా, జీవన జ్యోతి లో రూ.36 తో 2 లక్షల పొందే అవకాశం..!

-

మోదీ అందిస్తున్న పథకాలలో కొన్ని ప్రజలకు సంతృప్తిని ఇస్తున్నాయి..ఆ పథకంలో వెంటనే డబ్బులు కూడా వస్తున్నాయి. అలాంటి పథకాలలో సురక్ష భీమా, జీవన జ్యోతి పథకాలు కూడా ఉన్నాయి. వీటిలో డబ్బులు పెట్టిన వాళ్ళకు మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..జీవిత బీమాకు ఎంతటి ప్రాధాన్యం ఉందో మనందరికీ తెలిసిందే. మనం ఎంతగానో ప్రేమించే వ్యక్తి మరణిస్తే.. ఆ బాధ నుంచి కోలుకునేందుకు చాలా సమయం పడుతుంది..

కుటుంబానికి మూలధారమైన వ్యక్తి అయితే ఆ బాధకు ఆర్థిక ఇబ్బందులు తోడవుతాయి. జీవిత బీమా ఉంటే కొంత వరకు ఆర్థిక సమస్యలను నుంచి బయటపడొచ్చు. అందువల్లే ప్రతి ఒక్కరికీ జీవిత బీమా ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు.బీమా ప్రీమియం చెల్లించలేకనో, అవగాహన లేకపోవడం వల్లనో చాలా మంది ఇంతటి ప్రాధాన్యం ఉన్న జీవిత బీమాకు దూరంగానే ఉంటున్నారు. దీంతో వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత ఉండటం లేదు. ఈ కారణం వల్లే జీవిత బీమా సామాన్యులకు సైతం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నామమాత్రపు ప్రీమియంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజనను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.

ఏ కారణం చేతనైనా పాలసీదారుడు మరణిస్తే కుటుంబానికి హామీ మొత్తం అందజేస్తుంది. ఈ పథకం ఒక సంవత్సరం కాలపరిమితితో వస్తుంది. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ప్రీమియం చెల్లించి పథకాన్ని పునురుద్ధరించుకోవచ్చు. లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో పాటు దాదాపు అన్ని జీవిత బీమా సంస్థలు ఈ పథకాన్ని అందిస్తున్నాయి..జూన్ 1 నుంచి మే 31 వరకు అమల్లో ఉంటుంది. తర్వాత ఏడాదికి పునరుద్ధరించుకోవాలనుకునే వారు మే 31న ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ పథకాన్ని మధ్యలో ప్రారంభించినప్పటికీ.. ఖాతాదారుడు అభ్యర్ధించిన తేదీ నుంచి ప్రారంభమై మే31తో కవరేజ్ ముగుస్తుంది. తర్వాతి ఏడాది నుంచి జూన్ 1 నుంచి మే 31 వరకు అమల్లో ఉంటుంది..45 రోజుల తర్వాత మాత్రమే బీమా వర్తిస్తుంది..

ప్రస్తుతం వర్తించే ప్రీమియం ఏడాదికి రూ.436. 2015లో పథకాన్ని ప్రారంభించినప్పుడు కేవలం రూ.330 ప్రీమియంతోనే అందించేవారు. ఈ పథకం దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ప్రతికూలతలను దృష్టిలో ఉంచుకుని ప్రీమియంను రూ.330 నుంచి రూ. 436కి పెంచినట్లు ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది. పెంచిన ప్రీమియం రేట్లు జూన్ 1, 2022 నుంచి అమల్లోకి వచ్చాయి..ఈ పథకంలో చేరిన సభ్యుడు 55 సంత్సరాల వయసుకు చేరినప్పుడు మాత్రమే రద్దు అవుతుంది.రోజుకు 1.20 పైసలు, నెలకు రూ.36 చొప్పున పడుతుంది..ఇలా అయితే మనకు 2లక్షలు చేతికి వస్తుంది..ఇప్పుడు ఏదైనా భీమాను మాత్రం తప్పక తీసుకోవాలి..

Read more RELATED
Recommended to you

Latest news