మట్టి లేకుండా ఆలును పండించిన ఇంజీనీర్ బ్రెయిన్ సూపరేహే..

-

సాదారణంగా ఏదైనా మొక్కలు పండించాలి అంటే మట్టి తప్పనిసరిగా ఉండాలి..కానీ ఇప్పుడు టెక్నాలజీని వాడి మట్టి లేకుండా సేంద్రియ పద్దతిలో మొక్కలను నాటి అధిక లాభాలను పొందే వాళ్ళు రోజు రోజుకు పెరిగి పోతూన్నారు..ఇప్పుడు ఓ ఇంజినీర్ మట్టిలో పండే బంగాళదుంపలను గాలిలో కాసేలా చేశారు. మట్టి అవసరం లేకుండా డాబా మీద, గార్డెన్ లో పండిస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు..అందరు అతన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు.

 

వివరాల్లొకి వెళితే.. సూరత్‌లోని అడాజన్ ప్రాంతంలో నివసించే సుభాష్ అనే వ్యక్తి ఓ ఇంజినీర్. అతనికి జాబ్ తో పాటు రకరకాల మొక్కలను ఇంటి ఆవరణంలో పెంచడం ఇష్టం. ప్రతి రోజూ మొక్కల పెంపకం పై కొంత సమయాన్ని కేటాయిస్తు వస్తున్నారు.ఇక శని, ఆది వారాలలో పూర్తిగా మొక్కలను చూసుకుంటాడు..ఈ క్రమంలో కొత్త ఆలోచన చేశాడు.బంగాళదుంపలా కనిపించే ఓ దుంపను మట్టి అవసరం లేకుండా తీగపై పెరుగుతుంది..

ఈయన వివిధ ప్రాంతాలకు వెళ్ళడం అంటే సరదా..అలా ఓసారి సౌరాష్ట్రలోని గిర్ అడవులకు వెళ్ళినప్పుడు బంగాళాదుంప విత్తనాలను తీసుకొచ్చాడు. అవి గాలి పోటాటో..కొండల్లో, అడవుల్లో అవి తీగలాగ పెరుగుతాయి.ఈ పొటాటో వృక్షశాస్త్ర నామం డియోస్కోరియా బల్బిఫెరా.. గాలిలో పెరుగుతున్న ఈ బంగాళదుంపలను చూడటానికి జనం ఎగబడుతున్నారు.వీటిని చూడటానికి జనం క్యూ కడుతున్నారు..దాంతో బంగాళదుంపలకు డిమాండ్ కూడా భారీగా పెరిగింది. ఇవి రసాయన రహితంగా పెరుగుతాయి. సంవత్సరంలో చాలా సార్లు కాపు కాస్తాయి.మొత్తానికి ఈయన రియల్ హీరో అయ్యాడు.ఇప్పుడు వార్తల్లో నిలిచాడు.ఇలాంటి ఆలోచన రావడం నిజంగా గ్రేట్..

Read more RELATED
Recommended to you

Latest news