గూస్ బంప్స్‌ తెప్పించేలా సూర్య ‘కంగువ’ గ్లింప్స్

-

విల‌క్షణ పాత్రలను ఎంచుకోవ‌డం, విభిన్నమైన ప్రయోగాలు చేయ‌డంలో ఎప్పుడూ ముందుండే హీరో సూర్య తాజాగా న‌టిస్తున్న చిత్రం `కంగువ‌`. సూర్య 42 ప్రాజెక్ట్‌గా శివ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో వస్తోంది. ముందుగా ప్రకటించిన ప్రకారం సూర్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. నేడు కంగువ గ్లింప్స్ వీడియోను విడుదల చేయగా నెట్టింట హల్ చల్ చేస్తోంది.

ఖడ్గాన్ని చేతబూని గుర్రంపై రౌద్రరసం ఉట్టిపడేలా ఉన్న సూర్యను ఈ ఫస్ట్ లుక్ లో చూడొచ్చు. కంగువ…. ఒక యోధుడు, ఒక నాయకుడు, ఒక రాజు… అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాదు, గ్లింప్స్ ఆఫ్ కంగువ పేరిట వీడియోను కూడా చిత్రబృందం పంచుకుంది. కంగువ థీమ్ సాంగ్ వినిపిస్తుండగా, వీరోచిత పోరాట దృశ్యాలతో ఈ గ్లింప్స్ సూర్య అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.

పలు భాషల్లో తెరకెక్కుతున్న కంగువ చిత్రానికి శివ దర్శకుడు. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్, కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో సూర్య సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానీ కథానాయికగా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version