LIC ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. వీటి వలన మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మెరుగైన రాబడిని పొందాలంటే LIC లో పెట్టుబ్బడి పెట్టచ్చు. అలానే చాలా మంది రిటైర్ అయ్యాక ఆర్ధిక ఇబ్బందులు వుండకూడదు అని నచ్చిన స్కీమ్స్ లో డబ్బులని పెడుతూ వుంటారు.
ఇలా డబ్బులు పెడితే పదవీ విరమణ తర్వాత మీకు ప్రతి నెలా 20 వేల రూపాయలు వస్తాయి. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జీవన్ అక్షయ్ ప్లాన్‌ని అందిస్తోంది. దీని వలన ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. ఇందులో పెట్టుబడి పెట్టడం సురక్షితమే. ఇందులో డబ్బులని పెడితే ప్రతి నెల, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, వార్షిక ప్రాతిపదికన పెన్షన్ పొందవచ్చు. 75 ఏళ్లు దాటితే ప్రతి నెలా పెన్షన్ ని పొందొచ్చు.
పెన్షన్ ని పొందాలంటే రూ.610800 ఒకేసారి ప్రీమియం చెల్లించాలి. దీని మీద హామీ మొత్తం రూ.6 లక్షలు. పెన్షన్ ఎంత వస్తుందనేది చూస్తే.. వార్షిక పింఛను రూ.76 వేల 650, అర్ధవార్షిక పింఛను రూ.37 వేల 35 వుంది. అలానే త్రైమాసిక పింఛన్ రూ.18 వేల 225 అదే నెలవారీ పెన్షన్ అయితే 6,008 రూపాయలు వస్తాయి. ఈ పెన్షన్ జీవితాంతం వస్తుంది. ఒకేసారి రూ. 40,72,000 పెట్టుబడి కనుక పెడితే అప్పుడు మీకు ప్రతి నెలా రూ.20 వేలు వస్తాయి. ఈ పాలసీ వలన మరో బెనిఫిట్ ఏంటంటే ఈ పాలసీని కొనుగోలు చేసిన మూడు నెలల తరవాత లోన్ తీసుకునే అవకాశం కూడా వుంది. ఈ పాలసీ లో ఎంతైనా పెట్టచ్చు. లిమిట్ ఏమి లేదు. కానీ కనీసం లక్ష రూపాయలను పెట్టుబడి పెట్టాలి.