సస్పెన్షన్ పై విపక్షాల పోరు.. ఆ కండిషన్ కు ఓకే ఐతే ఎత్తివేస్తామన్న కేంద్రం

-

ఉభయ సభల నుంచి ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేయాలంటూ డిమాండ్ చేశాయి. ఇప్పటికే  24 మంది ఎంపీలు సస్పెన్షన్ కు గురవగా.. తాజాగా బుధవారం మరో రాజ్యసభ ఎంపీపై వేటు పడింది. అనుచితంగా ప్రవర్తన కారణంగా ఆమ్​ఆద్మీ పార్టీ నేత సంజయ్​ సింగ్​ ను  సస్పెండ్​ చేశారు.
సస్పెన్ష​న్ కు గురైన 20 మంది రాజ్యసభ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు. 50 గంటలపాటు ఇలానే ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గత రెండు రోజుల్లో సస్పెన్షన్ కు  గురైన 20 మంది ఎంపీల్లో తృణమూల్​ కాంగ్రెస్​కు చెందిన వారు ఏడుగురు, డీఎంకే నుంచి ఆరుగురు, తెరాస చెందిన వారు ముగ్గురు, సీపీఎం నుంచి ఇద్దరు, సీపీఐ, ఆమ్​ ఆద్మీల నుంచి చెరో ఎంపీ ఉన్నారు. కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ ఒక రాజు అని.. అందుకే 57 మంది ఎంపీలను, 25 ఎంపీలను సస్పెండ్​ చేయించారన్నారు. ప్రశ్నలకు భయపడే మోదీ ఇదంతా చేస్తున్నారని విమర్శించారు.
రాజ్యసభలో ఎంపీల సస్పెన్షన్ పై  విపక్ష నేతలు.. ఛైర్మన్​, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భేటీ అయ్యారు. సస్పెన్షన్​ తొలగించాలని విజ్ఞప్తి చేశారు. అయితే చేసిన తప్పును ఒప్పుకుంటేనే సస్పెన్షన్​ తొలగిస్తానని వెంకయ్య స్పష్టం చేశారు. 10 మంది నేతలు పాల్గొన్న ఈ భేటీలో ధరల పెంపుపై సభలో చర్చకు అవకాశం కల్పించాలని నేతలు వెంకయ్యకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు వరుస సస్పెన్షన్ లతో సభలో గందరగోళం నెలకొనగా సమావేశాలను గురువారానికి వాయిదా వేశారు. బుధవారం సెషన్​లో రాజ్యసభ మూడు సార్లు వాయిదా పడింది.
లోక్​  సభలోనూ ఇదే పరిస్థితి. ధరల పెంపు, అగ్నిపథ్​, జీఎస్​టీ మొదలైన అంశాలపై విపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు నలుగురు కాంగ్రెస్​ ఎంపీలు సస్పెన్షన్​ కు గురయ్యారు. ఎంపీల సస్పెన్షన్​ ఎత్తివేయాలని ప్రతిపక్ష నేతలు కోరగా.. ఇకపై నిరసనలు చేపట్టమని హామీ ఇస్తేనే ఉపసంహరణ చర్యలు చేపడతామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషి స్పష్టం చేశారు. వెల్​ వద్దకు వెళ్లకుండా, ఎలాంటి ప్లకార్డులు ప్రదర్శన చేపట్టమని హామీ ఇవ్వాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news