‘సర్కారు వారి పాట’ అప్‌డేట్..మహేశ్ బాబు, కీర్తి సురేశ్ ఊర మాసు స్టెప్పులు

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ పిక్చర్ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ క్రమంలోనే మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ నెల 7న తెలంగాణలోని హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్ డేట్ ఇచ్చేశారు. చిత్రంలోని మాస్ మసాలా సాంగ్ ‘మ..మ..మ..మహేశా’ సాంగ్ ను ఈ నెల 7న ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ సాంగ్ కు లిరిక్స్ అనంత శ్రీరామ్ అందించగా, మ్యూజిక్ ఎస్.ఎస్.థమన్.

మహేశ్ బాబును ఈ సాంగ్ లో నెవర్ బిఫోర్ అవతార్ లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్ లో మహేశ్ బాబు లుక్ అదిరిపోయింది.

కీర్తి సురేశ్ సైతం క్యూట్ గర్ల్ గా మహేశ్ తో చిందేస్తున్నట్లు కనబడుతోంది. మొత్తంగా దర్శకుడు పరశురామ్ సూపర్ స్టార్ అభిమానులకు ఈ సినిమాతో ఫుల్ మీల్స్ అందించేస్తు్న్నారని అర్థమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news