హైదరాబాద్: లష్కర్ బోనాల్లో రంగం వేడుక ప్రారంభమైంది. జోగిని స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు. కరోనా మహమ్మారి ఇబ్బంది పెట్టినా జనం తనను నమ్మినందుకు సంతోషంగా ఉందన్నారు. తన భక్తులను సంతోషంగా ఉండేలా చూసుకుంటానని స్వర్ణలత చెప్పారు. ‘‘అమ్మకు ఇంత చేసినా మాకు ఏమీ జరగలేదని అనుకోవద్దు..మీ కష్ట, నష్టాల్లో నేను ఉంటా. వర్షాల వల్ల కొంచెం ఇబ్బంది పడతారు. మిమ్మల్ని కాపాడతా. మీరు ధైర్యంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు బాధపడొద్దు. నేను మీ వెంట ఉంటా.’’ అని స్వర్ణలత భవిష్యవాణి తెలిపారు.
స్వర్ణలత భవిష్యవాణి చెప్పడంతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల్లో కీలక ఘట్టం వైభవంగా ముగిసింది. రెండు రోజుల పాటు బోనాలు ఘనంగా జరిగాయి. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. స్వర్ణలత రంగం కార్యక్రమంలో ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.