టీ 20 ఫైనల్లో తలపడేవి ఈ జట్లే… ఆస్ట్రేలియన్ మాజీ స్టార్ స్పిన్నర్ జోస్యం

యూఏఈ వేదికగా జరుగుతున్న టీ 20 పురుషుల ప్రపంచ కప్ క్రికెట్ అభిమానులకు కనువిందు చేస్తోంది. ప్రస్తుతం లీగ్ దశల్లో మ్యాచులు జరగుతున్నాయి. అయితే మాజీ క్రికెటర్లు మాత్రం ఫైనల్ లో తలపడే జట్లు ఇవే అంటూ వ్యాఖ్యలు చేస్తూ ఆసక్తి రేపుతున్నారు. నిన్న ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ బెన్ స్టోక్స్ ఇలాగే ఫైనల్ లో పాక్, ఇంగ్లాండ్ తపడుతాయని జోస్యం చెప్పారు. తాజాగా ఈ జాబితాలో ఆస్ట్రేలియన్ వెటరన్ స్టార్ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ కూడా ఇలాగే చెప్పాడు. ఏఏ జట్లు సెమీస్ కు వస్తాయి, వీటిలో ఫైనల్లో తలపడే జట్లు ఇవే అంటూ అంచనా వేస్తున్నారు.

 ప్రస్తుతం గ్రూప్ 1 లో పాయింట్ల పట్టికలో ఉన్న అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లండ్ తో పాటు ఆస్ట్రేలియా జట్లు సెమిస్ కు చేరుతాయి. ఇదే విధంగా గ్రూప్ 2 లో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న పాకిస్థాన్ తో పాటు ఇండియా సెమిస్ కు చేరుతాయని ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఇదే విధంగా ఫైనల్ లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు లేకపోతే ఇండియా, పాక్ జట్లు తపడుతాయని అంచానా వేస్తున్నాడు. సెమీస్ లో ఇంగ్లండ్, ఇండియా మరియు ఆస్ట్రేలియా, పాక్ జట్లు తలపడే అవకాశం ఉంటుందని ట్విట్టర్ వేదికగా స్పందించారు. అయితే షేన్ వార్న్ అంచనాలు ఫలిస్తాయో… లేదో తెలియాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే.