టీ20 ప్రపంచ కప్ లో మరో కీలక మ్యాచ్ నేడు జరుగనుంది. ఇండియా న్యూజిలాండ్ మధ్య నేడు దుబాయ్ వేదిక మ్యాచ్ జరుగబోతోంది. రెండు జట్లకు ఈమ్యాచ్ చాలా కీలకం కానుంది. కోహ్లీ బృందం మరో కఠిన ప్రత్యర్థి న్యూజిలాండ్ ను ఎదుర్కోబోతోంది. గత ఆదివారం జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ చేతిలో ఇండియా ఘోర పరాజయం చవిచూసింది. ఇదే విధంగా న్యూజిలాండ్ కూడా పాక్ చేతిలో ఓడిపోయింది. 10 వికెట్ల తేడాతో ఓడిపోవడం విమర్శలకు దారి తీసింది. సెమిస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇరు జట్లు ఈ మ్యాచ్ లో గెలుపు కోసం పోరాల్సిందే. ఇప్పటికే వరసగా మూడు విజయాలతో గ్రూప్ 2లో పాకిస్థాన్ టీం దాదాపుగా సెమిస్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. రెండోస్థానం కోసం ఇటు ఇండియా, అటు న్యూజిలాండ్ పోరాడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుకు సెమిస్ అవకాశాలు మెరుగవుతాయి.
ఇండియాను ఓడించేందుకు న్యూజిలాండ్ ప్లాన్ చేస్తుంది. షహీన్ అఫ్రిది స్పూర్తిగా తీసుకుని బౌలింగ్ చేస్తానని ఆ జట్టు లెఫ్టార్మ్ పేసర్ బౌల్ట్ ఛాలెంజ్ విసురుతున్నారు. మరోవైపు ఇండియా ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ, రాహుల్ దారుణంగా విఫలపమయ్యారు. వీరిద్దరు చెలరేగితే న్యూజిలాండ్ కు ఇబ్బందులు తప్పకపోవచ్చు. మరోవైపు భారత్ బౌలింగ్ కూడా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. గత మ్యాచ్ లోభువనేశ్వర్ కుమార్, షమీ, బూమ్రా పెద్దగా ప్రభావం చూపించలేదు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా నిరాశ పరిచాడు. ప్రస్తుతం ఈ మ్యాచులో బౌలర్లు ప్రభావం చూపిస్తే సగం విజయం ఖాయమవుతుంది. మిడిల్ ఆర్డర్ లో పంత్, సూర్యకుమార్ యాదవ్ పెద్ద ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఇదిలా ఉంటే న్యూజిలాండ్ కూడా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ లో విఫలమైంది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ గప్తిల్ కూడా అనుకున్నంతగా రాణించలేదు.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, రాహుల్, సూర్యకుమార్, పంత్, హార్దిక్, జడేజా, భువనేశ్వర్, షమీ, బుమ్రా, వరుణ్.
న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, కాన్వే, నీషమ్, ఫిలిప్స్, డరైల్, సీఫెర్ట్, సాన్‌ట్నర్, సోధి, బౌల్ట్, మిల్నే.