T20 World Cup: రాణించిన టీమిండియా… బంగ్లా టార్గెట్ ఎంత అంటే..?

-

T20 వరల్డ్ కప్ సూపర్-8లో బాగా ఈరోజు బంగ్లాదేశ్ తో టీమ్ ఇండియా తలపడుతుంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ బౌలింగ్ ఎంచుకున్నారు. ఈ మొదటగా బ్యాటింగ్ దిగిన టీమిండియా నిర్ణిత 20 ఓవర్లలో 196/5 స్కోర్ చేసింది.

మొదట హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (23; 11 బంతుల్లో), విరాట్ కోహ్లి(37; 28 బంతుల్లో) మంచి ఆరంభాన్ని ఇవ్వగా.. ఆ తరువాత వచ్చిన బ్యాటర్లు ఆ దూకుడును అలానే కొనసాగించారు.8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోయి 71 రన్స్ తో పటిష్టంగా ఉన్న టీమిండియా….తంజిమ్ హసన్ వేసిన తొమ్మిదో ఓవర్లో 2 కీలక వికెట్లు కోల్పోయింది.విరాట్ కోహ్లి, సూర్య కుమార్ యాదవ్ ఇద్దరూ బంతి తేడాతో పెవిలియన్ చేరారు. తొలి బంతికి కోహ్లి క్లీన్బోల్డ్ అవ్వగా.. అదే ఓవర్ మూడో బంతికి సూర్య(6) క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ సమయంలో రిషబ్ పంత్(36; 24 బంతుల్లో), శివం దూబే(34; 24 బంతుల్లో) కలిసి నాలుగో వికెట్కు 31 రన్స్ జోడించారు. పాండ్యా(50 నాటౌట్; 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్ లు) దూకుడు కనపరిచారు. ముస్తాఫిజుర్ వేసిన ఆఖరి ఓవర్లో హార్దిక పాండ్య 18 పరుగులు రాబట్టి.. మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. ఇక  బంగ్లాదేశ్ బౌలర్లలో తంజిమ్ హసన్, రిషాద్ చెరో 2 వికెట్లు, షకీబ్ అల్ హసన్ ఓ వికెట్ పడగొట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version