MLC కవితను కలిసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్… బీజేపీపై ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ సైన్యం ఎంతో తెలుసా..మేం దాడి చేస్తే తట్టుకోలేరని బీజేపీ పార్టీకి తలసాని వార్నింగ్ ఇచ్చారు. వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలు జరుగుతున్నప్పుడు బీజేపీ నేతలు కవిత ఇంటికి వచ్చారని.. మేమంతా అక్కడ ఉన్నాం, బీజేపీ నేతలు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా రావడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు.
ఇలా ఇంటికి రావడం దుర్మార్గం, హేయమైన చర్య అని.. మీ ఇళ్ల మీదకి రావాలంటే పెద్ద విషయం కాదు, మా టీఆర్ఎస్ సైన్యం ఎంతో మీకు తెలుసా? అని ప్రశ్నించారు. నిన్న ముట్టడికి కారణం ఏంటో, ఆ అంశం పై మీకు అవగాహన ఉందా? ఎవరో ఒక ఎంపీ మాట్లాడిన మాటలను, ఫాల్స్ ఎలిగేషన్ ను పట్టుకొని, బాధ్యత గల వ్యక్తి ఇంటికి రావడం సమంజసం కాదన్నారు.
వేలాది సైన్యం మాకు ఉంది, మీ ఇళ్ల మీద దాడులు, పార్టీ ఆఫిస్ల మీదకు వస్తే పరిస్థితి ఏంటి? సంగీభావం చెప్పడానికి వచ్చిన మా కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ ముట్టడికి వెళ్తాము అని అంటున్నారన్నారని హెచ్చరించారు. మాకు సంస్కారం ఉంది, మా అధినేత అది నేర్పలేదు.. నిన్నటి ముట్టడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు తలసాని.
MLC కవితను కలిసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నిన్న కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తలు రావడంపట్ల కవిత ఇంటికి వచ్చి సంఘీభావం తెలిపిన మంత్రి తలసాని, భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు#kavita #talasani #TRS #BJP #DelhiLiquorPolicyScam @TelanganaCMO @BJP4Telangana @YadavTalasani pic.twitter.com/k1ze7BNXHw
— Zee Telugu News (@ZeeTeluguLive) August 23, 2022