ఆషాడమాసం వచ్చిదంటే చాలు హైదరాబాద్ బోనాల సందడి మామూలుగా ఉండదు. అయితే.. నిన్న, మొన్న సికింద్రాబాద్ ఉజ్జయిన మహకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అయితే.. ప్రభుత్వం చేసిన ఏర్పాట్లతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని దర్శించుకున్నారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, కమిటీ సభ్యుల కృషి ఫలితంగా మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయని వెల్లడించారు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. మంగళవారం ఆయన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పండుగలు, ఉత్సవాల విశిష్టత మరింత పెరిగిందన్నారు. లక్షలాది మందిగా వచ్చిన భక్తులు స్వల్ప సమయంలో నే దర్శనం చేసుకున్నారన్నారు మంత్రి తలసాని. ఇంత గొప్పగా జాతర నిర్వహణకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఈ నెల 31 వ తేదీన సన్మానిస్తామని స్పష్టం చేశారు మంత్రి తలసాని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అనేక ఆలయాలు అభివృద్ధికి నోచుకున్నాయన్నారు మంత్రి తలసాని.