చేవెళ్ళ పోరు: కొండాని ఆపడం కష్టమే?

-

రాజకీయాల్లో విజయాలు అనేవి చాలా కష్టపడితేనే వస్తాయి..అయితే ఒకోసారి ఎంత కష్టపడిన విజయాలు అందవు..అలా అని విశ్రమించకుండా పనిచేస్తే ఎప్పటికైనా విజయం అందుకోవచ్చు. ఇప్పుడు అదే దిశగా మాజీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పనిచేస్తున్నారని చెప్పొచ్చు. రాజకీయాల్లో సామాజిక సేవ చేసే నేతలు చాలా తక్కువ. ఏదో ఎవరికి వారు స్వార్ధమైన రాజకీయాలు చేయడం తప్ప..సమాజ సేవ చేద్దామనుకునే వారు ఎక్కువ ఉండరు.

కానీ కొండా అలాంటి నేత కాదు…పదవి ఉన్నా లేకపోయినా ఎప్పుడు ప్రజల కోసమే పనిచేస్తారు…సొంత డబ్బులు సైతం ఖర్చు పెట్టి ప్రజలకు తనకు చేతనైన సాయం చేస్తారు. అలాగే కష్టాల్లో ఉన్న ప్రజలకు…కీలకమైన సలహాలు కూడా ఇస్తారు. అయితే ఇలా సమాజం పట్ల బాధ్యతతో ఉండే కొండాని గత ఎన్నికల్లో చేవెళ్ళ ప్రజలు ఓడించారు. అయితే తక్కువ మెజారిటీతోనే కొండా చేవెళ్ళ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

అయితే 2014లో ఈయన టీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే..కానీ టీఆర్ఎస్ లో నడిచే ఏక నాయక పాలన నచ్చక..ఆ పార్టీ నుంచి బయటకొచ్చేశారు…ఇంకా చెప్పాలంటే కేటీఆర్ వర్గం…కొండాని బయటకు వెళ్లిపోయేలా చేసింది. అలా టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన ఆయన…తర్వాత కాంగ్రెస్ లో చేరి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ళ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఓడిపోయిన సరే ఈయన ప్రజలకు సేవ చేస్తూనే వచ్చారు.

ఆ తర్వాత నిదానంగా కాంగ్రెస్ కు దూరమై..స్వతంత్రంగా పనిచేసుకుంటూ వచ్చారు. ఇదే క్రమంలో బీజేపీలో చేరి దూకుడుగా రాజకీయాలు చేస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఈయన మళ్ళీ చేవెళ్ళ బరిలో దిగడం ఖాయం. అయితే బీజేపీ తరుపున చేవెళ్ళ ఎంపీ టికెట్ ఆశించే నేతలు ఎక్కువగానే ఉన్నారు. ఎంతమంది ఉన్నా సరే వారిని బుజ్జగించి…చేవెళ్ళ సీటు కొండాకు ఇవ్వడం ఖాయం. అలాగే ఈ సారి అక్కడ గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ కు వ్యతిరేక గాలి వీస్తుంది..కాంగ్రెస్ బలం తగ్గింది..బీజేపీ బలం పెరుగుతుంది. అలాగే గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి కొండాపై ఉంది. మొత్తానికి చూసుకుంటే ఈ సారి చేవెళ్లలో కొండా గెలుపు ఆపడం కష్టమే అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news