రజినీకాంత్ ‘జైలర్’లో తమన్నా

-

రజనీకాంత్ కథానాయకుడిగా ‘జైలర్’ సినిమా రూపొందుతోంది. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రజనీకాంత్ ‘జైలర్’గా డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నారు. కథ అంతా కూడా జైలుతో ముడిపడిన జైలర్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో సునీల్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు.

ఆయన లుక్ కి సంబంధించిన పోస్టర్ ను ఇటీవల రిలీజ్‌ చేశారు. అయితే, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న జైలర్ మూవీలో నటిస్తున్నట్లు తాజాగా హీరోయిన్ తమన్నా ప్రకటించింది. రజినీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి సునీల్, మోహన్ లాల్ లుక్స్ రిలీజ్ చేశారు మేకర్స్.

Read more RELATED
Recommended to you

Exit mobile version