పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తమన్నా..!

-

మిల్క్ బ్యూటీ తమన్నా.. తమ నటనతో, అందంతో, స్కిన్ షో చేస్తూ చూపర్లను ఆకట్టుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా తన మేని ఛాయతోనే ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.అంతేకాదు స్టార్ హీరోల వారసులతో కూడా జతకట్టి నటించిన తమన్నా ఈమధ్య మరీ ఎక్కువగా గ్లామర్ షో చేస్తుందని చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా ఈమె ఇండస్ట్రీకి వచ్చి 17 సంవత్సరాల అవుతున్నప్పటికీ చెక్కుచెదరని అందంతో అదే స్టార్ పొజిషన్ ను కొనసాగుతూ వస్తోంది. ఇకపోతే ఇటీవల ఈమె నటించిన చిత్రం సీటీమార్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఈమె మళ్లీ చిరంజీవి సినిమాలో నటిస్తోంది.

ఇకపోతే వృత్తిరీత్యా తనదైన స్టైల్ లో దూసుకుపోతున్న ఈమె వ్యక్తిగతంగా పెళ్లి సంగతులు ఏమిటి అనే విషయం ప్రస్తుతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు.. అన్న ప్రశ్న మొదలైనప్పుడు తెలివిగా తప్పించుకుంటూ ఉంటుంది. నా ఆలోచనలో ఎంత పరిణితి అయితే కనిపిస్తుందో.. అమ్మ నాన్న ఆలోచనలోనూ అంతే పరిణితి కనిపిస్తుంది. నా కెరియర్ ని గమనిస్తున్న వాళ్ళు పెళ్లి అంటూ ఏ రోజు ఒత్తిడి తీసుకురాలేదు. ఆ సమయం వస్తే సంతోషంగా ఆ విషయాన్ని ఇంట్లోనూ.. మీడియాకి చెబుతాను అంటూ తెలిపింది. దీన్నిబట్టి చూస్తే ఇంకా తమన్నా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టలేదా అంటూ నెటిజన్లు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే తల్లిదండ్రుల బాధ్యత ప్రకారం తమన్నా.. వద్దన్నా సరే పెళ్లి పనులు ప్రారంభించాలి. కానీ తమన్నాను బాగా అర్థం చేసుకోవడంతోనే పేరెంట్స్ ఆ ఛాయిస్ తీసుకున్నట్లు కనిపించలేదంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇక తమన్నా కెరీర్లో కూడా ప్రేమ ఉందా? లేదా? అంటే లేదనే చెప్పాలి. ఇప్పటివరకు ఆమె ఎవరితో కూడా ప్రేమలో పడలేదు. డేటింగ్ కూడా చేయలేదు. క్రికెటర్ తో ప్రేమాయణం నడుపుతోందని వార్తలు వచ్చినా అందులో నిజం లేకపోయింది. ఇక ఏది ఏమైనా ప్రస్తుతం తమన్న వయసు 32 సంవత్సరాలు. పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news