కేసీఆర్ జీ చెన్నైకి రండి.. సీఎంకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆహ్వానం

-

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్​ తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్​కు ఆహ్వానం పంపారు. ఈ నెల 28 నుంచి చెన్నైలో జరగనున్న 44వ ఫిడే అంతర్జాతీయ చెస్ ఒలంపియాడ్ పోటీలకు రావాల్సిందిగా కోరారు. ఈ మేరకు డీఎంకే రాజ్యసభ సభ్యుడు గిరిజానన్ కేసీఆర్​కు ఆహ్వాన పత్రిక అందించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ చెన్నైకి రావాలని తమిళనాడు సీఎం స్టాలిన్​ ఆహ్వానం పంపారు. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో జరగనున్న 44వ ఫిడే అంతర్జాతీయ చెస్ ఒలంపియాడ్ పోటీలకు కేసీఆర్​ను ఆ రాష్ట్ర సీఎం ఎం.కె.స్టాలిన్ ఆహ్వానించారు. ఈ మేరకు డీఎంకే రాజ్యసభ సభ్యుడు గిరిజానన్ ద్వారా ఆహ్వాన లేఖను పంపారు. హైదరాబాద్ ప్రగతిభవన్​లో కేసీఆర్​ను కలిసిన గిరిజానన్.. ఆహ్వాన పత్రిక అందించారు. ఇది తన వ్యక్తిగత ఆహ్వానంగా భావించి జులై 28న ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని విజ్ఞప్తి చేశారు.

ఎంపీ గిరిజానన్.. ప్రగతి భవన్​లో కేసీఆర్​ను కలిసి శాలువా కప్పి జ్ఞాపికను అందించారు. అనంతరం ఫిడే అంతర్జాతీయ చెస్ ఒలంపియాడ్ పోటీలకు ఆహ్వానించారు. ఈ పోటీల్లో 188 దేశాల నుంచి చెస్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. భారత దేశంలో మొదటిసారిగా.. ఆసియాలో మూడోసారి జరుగుతున్న ఈ పోటీలు చాలా ప్రతిష్ఠాత్మకమైనవని ఆహ్వానలేఖలో స్టాలిన్ ప్రస్తావించారు.

Read more RELATED
Recommended to you

Latest news