ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఈ నేపధ్యంలో తమిళనాడు సిఎం సంచలన ప్రకటన చేసారు. తమిళనాడులో రేపటి నుంచి పూర్తి కర్ఫ్యూ ఉంటుందని అన్నారు. డిస్పెన్సరీలు, కంట్రీ డ్రగ్ స్టోర్లు, పాలు, నీరు, పత్రికల పంపిణీకి మాత్రమే అనమతి ఉంటుందని స్పష్టం చేసారు. కూరగాయలు, పండ్లు వాహనాల ద్వారానే విక్రయం అని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ, ప్రయివేటు బస్సులకి రేపటి వరకే అనుమతి అని స్పష్టం చేసారు. కరోనా మనకి రాకూడదు, మన వల్ల ఇంట్లో వారికి రాకూడదు, బయటి వారికి రాకూడదని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ పూనాలి అని ఆయన స్పష్టం చేసారు. కేసులు, మరణాల సంఖ్య తగ్గుతుంది. కరోనాని పూర్తిగా కట్టడి చేయడానికే పూర్తి కర్ఫ్యూ. ప్రజలందరూ సహకరించాలి అని కోరారు.