బండి-పవన్‌కు డ్యామేజ్..స్కెచ్ ఎవరిది?

-

ఏపీ రాజకీయాల్లోకి కేసీఆర్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీని విస్తరించే పనిలో భాగంగా..ఆయన అక్కడ రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో కొందరు కీలక నేతలని బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. తోట చంద్రశేఖర్, రావేల కిషోర్ బాబు, చింతల పార్థసారథిలతో పాటు పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరారు. అలాగే తోటకు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఇచ్చారు.

అయితే బీఆర్ఎస్ లో చేరిన మెజారిటీ నేతలు కాపు నేతలే. జనసేన నుంచి వచ్చిన వారే. ఇంకా ఎక్కువగా ఏపీలో కాపు నేతలపై ఫోకస్ పెట్టి అక్కడ రాజకీయం చేస్తారని తెలుస్తోంది. ఇలా కాపు వర్గాన్ని టార్గెట్ చేసి పరోక్షంగా పవన్‌ని దెబ్బతీయడానికి కేసీఆర్ చూస్తున్నారని, అలాగే జగన్‌కు పరోక్షంగా మేలు చేయాలని చూస్తున్నారని బీజేపీ-జనసేన నేతలు మండిపడుతున్నారు. అటు తెలంగాణలో తమ మద్ధతు దారుల చేత..కేసీఆర్‌కు సపోర్ట్ చేయించి..పరోక్షంగా అక్కడ బండి సంజయ్‌కు చెక్ పెట్టాలని జగన్..కేసీఆర్‌కు సపోర్ట్ చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.

అంటే ఏపీలో కేసీఆర్, తెలంగాణలో జగన్ రాజకీయం చేస్తూ..పరస్పరం ఇద్దరు నేతలు సహకరించుకుని, ప్రతిపక్షాలకు చెక్ పెట్టి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అంటే కేసీఆర్-జగన్..ఒకరి కోసం మరొకరు.. ఒకరిని గెలిపించేందుకు ఇంకొకరు అన్నట్లుగా కార్యాచరణ చేస్తున్నారని సమాచారం. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలిక ద్వారా వైసీపీ, తెలంగాణలో ఓట్లను సంఘటితం చేయడం ద్వారా బీఆర్‌ఎస్‌.. ఇలా ఇరు పార్టీలు లబ్ధి పొందాలన్నదే వ్యూహంగా తెలుస్తోంది.

అందుకే బీజేపీ నేతలు..కేసీఆర్ రాజకీయాలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏపీలో బీఆర్ఎస్ ప్రభావం ఎంతవరకు ఉంటుందో ఇప్పుడే చెప్పలేని పరిస్తితి. ఇంకా ఎక్కువ స్థాయిలో బడా నేతలని చేర్చుకుంటే…దాని వల్ల ఓట్ల చీలిక జరిగి..టీడీపీ-జనసేనలకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి కేసీఆర్ రాజకీయం ఎలా ఉంటుందో.

Read more RELATED
Recommended to you

Latest news