బండి సంజయ్ వారియర్ : తరుణ్‌ చుగ్‌

-

ఎలాంటి వారంట్ లేకుండా అక్రమంగా బండి సంజయ్ ను అరెస్ట్ చేశారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ చుగ్ విమర్శించారు. శుక్రవారంనాడు కరీంనగర్ లో బండి సంజయ్ కుటుంబ సభ్యులను తరుణ్ చుగ్ పరామర్శించారు. బండి సంజయ్ అత్త వనజ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. బండి సంజయ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం బండి సంజయ్ తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మీ కొడుకు వారియర్..మీరు బాధపడాల్సిన పని లేదు…అంటూ బండి సంజయ్ తల్లిని పరామర్శించారు. తర్వాత కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఎస్పీఎస్సీ లీకుల్లో సీఎం కేసీఆర్ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ తో కేసీఆర్ ఆడుకుంటున్నారని మండిపడ్డారు.

Congress enacting 'tamasha' in Punjab: Tarun Chugh | Cities News,The Indian  Express

తెలంగాణ మంత్రి వర్గం ఆలీబాబా 40 దొంగలుగా తయారైందని మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణను కేసీఆర్ భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో లిక్కర్ మాఫియా, లీకేజీ మాఫియా నడుస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని..ప్రజా సునామీలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news