గ్రామీణ విద్యార్థులకు టీసీఎస్ గుడ్​న్యూస్​​..!

-

గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్ధులకి టెక్​ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​ (టీసీఎస్​) శుభవార్త చెప్పింది. కెరీర్ కి అవసరమయ్యే ఒక ఆన్ లైన్ కోర్స్ ని తీసుకు వచ్చింది. ‘టీసీఎస్​ అయాన్​ కెరీర్​ ఎడ్జ్​’ పేరుతో ఈ కోర్సుని తీసుకు వచ్చింది. పూర్తి వివరాల లోకి వెళితే.. ‘టీసీఎస్​ అయాన్​ కెరీర్​ ఎడ్జ్​’ అనేది పదిహేను రోజుల కోర్సు.

లేటెస్ట్ టెక్నాలజీస్​పై పట్టు కోసం ఇది ఉపయోగపడుతుంది. దీనితో కమ్యూనికేషన్, కొలాబరేషన్​, బిజినెస్​, ఫైనాన్షియల్​, డిజిటల్ లిటరసీ వంటి ప్రధాన నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు. అదే విధంగా కోర్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్‌ను పెంచుకోవడానికి అవుతుంది. టీసీఎస్​ బిజినెస్​ యూనిట్ ఈ ప్రోగ్రామ్​ తీసుకు వచ్చింది.

ఆసక్తి ఉంటే విద్యార్థులు tcsion.comలో రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు గ్రామీణ విద్యార్థులు ఇబ్బంది పడుతున్న ఇంగ్లీష్​పై ప్రత్యేక కోర్సు ఇస్తోంది. ఆన్​లైన్​ రూపంలో అందిస్తున్నారు. రెండు వారాల ఈ కోర్సులో, విద్యార్థులు వారానికి కనీసం 7 నుంచి 10 గంటల లెర్నింగ్​ సెషన్స్ నిర్వహిస్తారు. యంగ్​ ప్రొఫెషనల్​ ప్రోగ్రామ్​లో మొత్తం 14 మాడ్యూల్స్​ ఉంటాయి.

ప్రతి మాడ్యూల్ 1 నుంచి 2 గంటల వ్యవధిలో పూర్తవుతుంది. వీడియోలు, ప్రెజెంటేషన్లు, రీడింగ్​ మెటీరియల్​ రూపంలో ఉంటుంది. రికార్డు చేయించిన వీడియోలు, వెబినార్ల ద్వారా ఈ కోర్సును అందిస్తారు. ఈ కోర్సులో అభ్యర్థికి బిహేవియరల్​ స్కిల్స్ నేర్పిస్తారు. తద్వారా, వర్క్​ప్లేస్​లో ఎలా వ్యవహరించాలనేది తెలుసుకోవచ్చు. ప్రజెంటేషన్​, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎఫెక్టివ్ రెజ్యూమ్​ను తయారు చేయడం, కార్పొరేట్ సెక్టార్​లో వ్యాపారులు మొదలైనవి టీసీఎస్​ అయాన్​ కెరీర్ ఎడ్జ్​లో పొందొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version