నెక్స్ట్ ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు తెగ కష్టపడుతున్నారు..వయసు మీద పడుతున్న సరే..ఏ మాత్రం తగ్గకుండా ఆ జిల్లా, ఈ జిల్లా అంటూ తిరుగుతూ, ప్రజలని కలుస్తున్నారు. ఈ సమయంలో కూడా బాబు కష్టపడటానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మరొకసారి టీడీపీ అధికారం కోల్పోయి, జగన్ అధికారంలోకి వస్తే టీడీపీ భవిష్యత్ అంధకారంలో పడినట్లే. పైగా బాబు వయసు కూడా అయిపోతుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ ఆయన పోరాడలేరు.
అందుకే ఇప్పుడు అధికారంలోకి వస్తే పార్టీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని బాబు కష్టపడుతున్నారు. ఎక్కడక్కడ పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బాబు ఇలా కష్టపడుతుంటే…కొందరు తెలుగు తమ్ముళ్లు మాత్రం ఇంకా కష్టపడటం లేదు. వీరి వల్ల పార్టీకి మైనస్ అయ్యేలా ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే చాలావరకు టీడీపీ నేతలు పికప్ అయ్యారు…కానీ ఇంకా కొందరు నేతలు మాత్రం అలాగే ఉండిపోయారు. వీరి వల్ల టీడీపీకి మైనస్ ఏమో గాని, వైసీపీకి ప్లస్ అయ్యేలా ఉంది.
ఎందుకంటే మూడేళ్లలో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరిగింది…ఊహించని విధంగా వైసీపీపై ప్రజల్లో ఆగ్రహం ఉంది. మరి ఇలాంటప్పుడు టీడీపీ నేతలు ఏం చేయాలి…వైసీపీపై ఉన్న వ్యతిరేకతని తమకు అనుకూలంగా మార్చుకుని బలపడాలి. కానీ కొందరు నేతలు మాత్రమే ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని బలపడుతున్నారు. మరి కొందరు మాత్రం అలాగే ఉండిపోతున్నారు. ఉదాహరణకు నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు లాంటి జిల్లాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనిపిస్తోంది. కానీ అదే సమయంలో వారిపై ఉన్న వ్యతిరేకతని ఉపయోగించుకుని బలపడటంలో టీడీపీ నేతలు ఫెయిల్ అవుతున్నారు. ఇక టీడీపీ నేతలు ఇలాగే ముందుకెళితే వైసీపీకే ప్లస్ అవుతుంది. ఓటమికి దగ్గరున్న వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ నేతలు వల్ల మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే చివరికి వైసీపీని టీడీపీ నేతలే గెలిపించేలా ఉన్నారు.