ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం…

గత రాత్రి వెల్లడైన ఫలితాలతో ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో జయకేతనం ఎగురవేసిన తెలుగుదేశం పార్టీ… ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. మూడింటికి మూడు స్థానాల్లో విజయభేరి మోగించింది. గత రాత్రి వెల్లడైన ఫలితాలతో ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ జయకేతనం ఎగురవేసింది. తాజాగా పశ్చిమ రాయలసీమ స్థానాన్ని కూడా చేజిక్కించుకుంది.

TDP claims victory in West Rayalaseema Graduate MLC Elections

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి 7,543 ఓట్లతో ఘనవిజయం సాధించారు. నిన్న ఆధిక్యంలో నిలిచిన వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి ఇవాళ ఆ ఆధిక్యాన్ని నిలుపుకోలేకపోయారు. రెండో ప్రాధాన్యత ఓట్లు ఆయనకు ప్రతికూలంగా మారాయి. తొలి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకపోవడంతో, రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించి విజేతను తేల్చారు.