ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని తొక్కిపట్టి నార తీశారు : నందమూరి బాలకృష్ణ

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీని తొక్కిపట్టి నార తొక్కిపట్టి నార తీశారని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘనవిజయాలతో టీడీపీ నేతల్లో కొత్త ఉత్సాహం పొంగిపొర్లుతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర (వేపాడ చిరంజీవిరావు), తూర్పు రాయలసీమ (కంచర్ల శ్రీకాంత్) పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకున్న టీడీపీ… పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ స్థానంలోనూ గెలుపు ముంగిట నిలిచింది.

Nandamuri Balakrishna's real estate remark draws flak- Cinema express

ఈ నేపథ్యంలో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. వై నాట్ 175 అని జగన్ ఇప్పుడంటే వినాలని ఉందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని తొక్కిపట్టి నార తీశారని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. పులివెందుల కోటకు బీటలు పడుతున్నాయని, త్వరలో ఆ బీటలు తాడేపల్లి ప్యాలెస్ వరకు చేరతాయని అన్నారు. గెలిచిన టీడీపీ అభ్యర్థులకు అభినందనలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.