ఆంధ్రప్రదేశ్ లో పాతకక్షలకు మళ్ళీ భగ్గుమన్నాయి. ఒకపక్క అధికార, ప్రతిపక్ష నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రెచ్చిపోతుంటే.. మరోవైపు కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. ఒకర్ని ఒకరు చంపుకుంటున్నటు. తాజాగా.. గుంటూరు జిల్లా గురజాల మండలం అంబాపురంలో టీడీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. గత అర్ధరాత్రి బైక్ పై వెళ్తున్న వారిపై కొందరు వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారు.

ఈ దాడిలో టీడీపీ కార్యకర్త దోమతోటి విక్రమ్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు పాతకక్షలే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ కోణంలో మృతుడితో గతంలో గొడవలకు దిగిన పలువురు వ్యక్తుల్ని విచారించే పనిలో పడ్డారు.