తమ ప్రభుత్వ హయంలో పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేయలేదని టీడీపీ నాయకులు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఒక వేళ తాము పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేసి ఉంటే.. ఇప్పటికే దొరికిపోయే వాళ్లమని అన్నారు. ఒక వేళ తమ పార్టీ ప్రభుత్వలో ఉన్న సమయంలో పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేసి ఉంటే.. ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి తెలుస్తుంది కదా అని అన్నారు. అలాగే రికార్డులను కూడా చెక్ చేసుకోవాలని సవాల్ చేశారు.
కాగ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎలాంటి సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిందో అని అన్నారు. అయితే చంద్ర బాబు ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేయాలని ఆ సంస్థ ఆఫర్ ఇచ్చిందని నారా లోకేశ్ అన్నారు. కానీ చంద్ర బాబు ఆ ఆఫర్ ను తిరస్కరించారని తెలిపారు. కాగ ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. పెగాసస్ స్పైవేర్ గురించి మాట్లాడుతూ.. అప్పట్లో చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు కొనుగోలు చేశారని ఆరోపించింది. దీంతో పెగాసస్ స్పైవేర్ వివాదం ఆంధ్ర ప్రదేశ్ లో తీవ్రం అయింది.