Breaking : ఏపీ సీఐడీ పోలీసులపై చింతకాయల విజయ్‌ ఫైర్‌

-

ఏపీ సీఐడీ పోలీసుల‌పై టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చింత‌కాయ‌ల విజ‌య్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కేసు ఏమిటో చెప్ప‌కుండా విచార‌ణ‌కు ర‌మ్మంటే ఎలా వెళ‌తామంటూ విజ‌య్ అన్నారు. ఇటీవ‌లే హైద‌రాబాద్‌లోని విజ‌య్ ఇంటికి వెళ్లిన సీఐడీ అధికారులు ఆయ‌న ఇంటిలో లేక‌పోవ‌డంతో ఇంటిలో విజ‌య్ డ్రైవ‌ర్‌కు నోటీసులు అందించిన సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా విజ‌య్ ఇంటిలో సీఐడీ అధికారుల తీరుపై విజ‌య్‌తో పాటు టీడీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాజాగా సీఐడీ ఇచ్చిన నోటీసుల‌కు స‌మాధానం చెబుతూ ఓ లేఖ రాశారు చింత‌కాయ‌ల విజ‌య్. స‌ద‌రు లేఖ‌ను తీసుకుని ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాదులు గుంటూరులోని సీఐడీ ప్ర‌ధాన కార్యాల‌యానికి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా విజ‌య్ లేఖ‌ను తీసుకునేందుకు సీఐడీ అధికారులు నిరాక‌రించ‌గా… లేఖ‌ను సీఐడీ కార్యాల‌యంలోని త‌పాలా విభాగానికి అంద‌జేశారు.

Chintakayala Vijay: ఆ వీడియోకు.. నాకూ ఏం సంబంధం? - NTV Telugu

విజ‌య్‌కు సీఐడీ ఇచ్చిన నోటీసులు అస‌లు చెల్లుబాటు కావ‌ని ఈ సంద‌ర్భంగా విజ‌య్ త‌ర‌ఫు న్యాయవాదులు తెలిపారు. నిందితుడికి గానీ, నిందితుడి కుటుంబ స‌భ్యులకు ఇచ్చే నోటీసులు మాత్ర‌మే చెల్లుబాటు అవుతాయ‌ని వారు తెలిపారు. విజ‌య్ డ్రైవ‌ర్‌కు ఇచ్చిన నోటీసులు చెల్ల‌వ‌ని వారు అన్నారు. ఈ వ్య‌వ‌హారంపై విజ‌య్ కూడా స్పందించారు. సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసుల్లో ఎలాంటి వివ‌రాలు లేవ‌ని అన్నారు చింత‌కాయ‌ల విజ‌య్. ఎఫ్ఐఆర్ కాపీ, క్రిమిన‌ల్ కేసుల వివ‌రాల‌ను సీఐడీ అధికారులు చెప్పాల‌ని డిమాండ్ చేశారు చింత‌కాయ‌ల విజ‌య్. సీఐడీ అధికారులు త‌న ఇంటిలోకి అక్ర‌మంగా చొర‌బ‌డ్డార‌ని ఆరోపించారు చింత‌కాయ‌ల విజ‌య్. త‌న కుమార్తెను బెదిరించార‌ని, త‌న డ్రైవ‌ర్‌ను కొట్టార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు చింత‌కాయ‌ల విజ‌య్.

 

Read more RELATED
Recommended to you

Latest news