లోన్ యాప్ కట్టడి చేయడంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు విఫలం అయ్యాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోన్ యాప్ కేటుగాల బారిన పడి అమాయకులు బలై పోతున్నారు.. లోన్ అప్పు చెల్లించినా లోన్ యాప్ కేటుగాలు వేధింపులు అపడం లేదన్నారు. పి.ఎఫ్.ఐ కుట్రను భంగం చేశామని గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.. అంతటి ఉగ్ర కుట్రను ఛేదించే యంత్రాంగం ఉన్నా దేశంలోని ఎందుకు లోన్ యాప్ కేటుగాల మూలాలను ఎందుకు కొనుక్కో లేక పోతుందని ఆయన ప్రశ్నించారు. ఉగ్రవాదుల మూలాలు ఉన్న వారిని పట్టుకున్నామని జబ్బలు చర్చుకుంటున్న కేంద్ర ప్రభుత్వం అని నారాయణ విమర్శించారు. లోన్ యాప్ కేటుగాలను ఎందుకు పట్టించుకోవడం లేదని, లోన్ యాప్ కేటుగాలను కఠినం శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
విజయవాడలో జరిగే మహా సభలకు దేశ విదేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని, బీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు ను తాను స్వాగతిస్తున్నామని, బి.ఆర్.యస్ ఏర్పాటు కోసం కెసిఆర్ దేశంలో ని అనేక రాష్ట్రాల్లో పర్యటించారన్నారు. కొత్త పార్టీ ఏర్పాటు లో అనేక అవాంతరాలు ఉంటాయి… కానీ వెనకడుగు వేయవద్దని ఆయన వ్యాఖ్యానించారు. బిజెపికి వ్యతిరేకంగా పార్టీలనీ ఏకం చేసినప్పుడే కెసిఆర్ లక్ష్యం నేరవేరుతుందని, బిజెపి ని ఓడించడానికి కాంగ్రెస్ తో పాటు అన్ని పార్టీలను కలుపుకోవాలని నిన్న కెసిఆర్ మీటింగ్ కు వచ్చిన ఓ ఎం.పి చెప్పారన్నారు. మాకు ఆహ్వానం ఉంది..కానీ మీరే వెళ్ళి లేదని, బిజెపి ఫ్యాక్షనిస్టులు కంటే దారుణంగా రాజకీయాలు చేస్తుందని ఆయన మండిపడ్డారు.