మహిళల మనోభావాల కంటే డర్టీ ఎంపీనే ఎక్కువయ్యారా? : నాగుల్‌ మీరా

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారం ఏపీ రచ్చ లేపుతోంది. ఎప్పటికే దీనిపై అనంతపురం ఎస్పీ క్లారిటీ ఇచ్చినా.. ప్రతి పక్షాలు మాత్రం ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టడం లేదు. అయితే.. డర్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను ఎందుకు వెనకేసుకొస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ ను టీడీపీ నేత నాగుల్ మీరా ప్రశ్నించారు. కోట్లాది మంది మహిళల మనోభావాల కంటే డర్టీ ఎంపీనే మీకు ఎక్కువయ్యారా అని మండిపడ్డారు నాగుల్ మీరా. సొంతగా చేసిన నేరాలను సమర్థించుకునేందుకు జగన్ ఒక గ్యాంగును రెడీ చేసుకుంటున్నారని విమర్శించారు నాగుల్ మీరా. జగన్ వైఖరి వల్లే మాఫియాలు, కిరాతకులు చెలరేగిపోతున్నారని అన్నారు.

AP: TDP's membership recruitment drive goes 'paperless'

గోరంట్ల మాధవ్ గలీజు వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్, పంజాబ్ ఎంపీ స్పందించినా… జగన్ మాత్రం స్పందించలేదని చెప్పారు నాగుల్ మీరా. నేరస్తులను కాపాడేందుకు కులాలను రెచ్చగొట్టే స్థాయికి దిగజారారని దుయ్యబట్టారు. జగన్ కు నిజంగా మహిళలపై చిత్తశుద్ధి ఉంటే గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నుంచి ఆయనను తక్షణమే బర్తరఫ్ చేయాలని చెప్పారు. మాధవ్ పై చర్యలు తీసుకోవాలని లోక్ సభ స్పీకర్ కు కూడా లేఖ రాయాలని అన్నారు నాగుల్ మీరా.