సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీడీవోలు

-

ఇటీవల సీఎం జగన్‌ సర్కార్‌ ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. దాదాపు 25 ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న 237 మంది ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవోలుగా, డీడీవోలుగా ఒకేసారి పదోన్నతి కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రెండు దశాబ్దాలుగాపైగా ఎంపీడీవోలు చూసిన ఎదురుచూపులను సీఎం జగన్‌ ప్రభుత్వం నిజం చేయడంతో వారు ఆనందంలో మునిగితేలుతున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు. ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన వారిలో ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కాకర్ల వెంకటరామిరెడ్డి, ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు వై.బ్రహ్మయ్య, ప్రధాన కార్యదర్శి జీవీ.నారాయణరెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ కె.శ్రీనివాసరెడ్డి, కన్వీనర్‌ కేఎన్‌వీ.ప్రసాదరావు, జాయింట్‌ సెక్రటరీ శ్రీనివాసరావులు ఉన్నారు. తమకు పదోన్నతులు కల్పించినందుకు వీరంతా సీఎం జగన్‌ను సన్మానించారు.

అనంతరం ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ చైర్మన్‌ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ‘ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎంపీడీవోలకు పదోన్నతులను సీఎం జగన్‌ ఇచ్చారు. కొత్తగా 51డీఎల్డీవో పోస్టులు సృష్టించి ఏప్రిల్ లో పదోన్నతులు ఇచ్చారు. జిల్లాల విభజన ప్రక్రియ వల్ల ఏప్రిల్ ఎంపీడీవోలకు పదోన్నతులు ఇవ్వలేకపోయారు. వెంటనే ఎంపీడీవోలకు పదోన్నతులు ఇవ్వాలని ఇటీవలే సీఎం ఆదేశించారు.నిన్న అర్హత కల్గిన ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పిస్తూ వ్యక్తిగతంగా అన్ని జిల్లాలకు నిన్న ఆదేశాలు పంపారు.పదోన్నతులు కల్పించినందుకు సీఎం జగన్ ను కలిసి కృతజ్ణతలు తెలిపాం.గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీలకు అవకాశం కల్పించాలని సీఎం ను కోరాం. అందుకు సీఎం జగన్‌ అంగీకరించారు’ అని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news