చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు లేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్సార్సీపీ పార్టీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు.. అక్రమాలు జరుగుతున్నాయంటూ లేఖలో తెలిపారు చంద్రబాబు. వైసీపీ నేతలతో అధికారులకు కుమ్మక్కై బోగస్ ఓట్ల నమోదు చేసారని ఫిర్యాదు చేపట్టారు. బోగస్, నకిలీ ఓట్లను ఓటర్ల జాబితాలో చేర్చడం వల్ల ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అవుతోందని తన ఆగ్రహం వ్యక్తపరిచారు. తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు చంద్రబాబు.
ఏపీలో రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటర్ల నమోదు విషయంలో టీడీపీ కొంత కాలంగా అధికార వైసీపీ పైన ఆరోపణలు చేస్తోంది. బోగస్ ఓట్ల నమోదు చేసారని ఆరోపిస్తున్నారు. వైసీపీ ముఖ్య నేత సజ్జల ఈ ఆరోపణలను ఖండించడం జరిగింది. అసలు తమకు ఆ అవసరమే లేదన్నారు. టీడీపీ ముందుగానే ఓటమికి సాకులు వెతుక్కుంటోందని కౌంటర్ ఇచ్చారు. ఇదే సమయంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు రాసిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు చంద్రబాబు. డిగ్రీ చదవని వ్యక్తులు, నకిలీ సర్టిఫికెట్లతో ఓటర్లుగా నమోదు అయ్యారని తెలిపారు. గెలుపు కోసం వైసీపీ అడ్డదారులు తొక్కుతోందని చంద్రబాబు తన లేఖలో వ్యక్తం చేసారు. ఇప్పటికే ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అనర్హులను చేర్చినట్లు సాక్ష్యాధారాలను కూడా జతచేశారు చంద్రబాబు.