ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 2022-23 బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు శాసన మండలి మరియు శాసన సభ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేసిన ప్రసంగంతో బడ్జెట్ సెషన్ ప్రారంభమవుతుంది.
ఫిబ్రవరిలో గుండెపోటుతో మరణించిన మాజీ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి నివాళులర్పించి మార్చి 8న సభ సంతాప తీర్మానాన్ని ఆమోదించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇది ఇలా ఉండగా.. శాసనమండలి సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం ఇవ్వాలని ఛైర్మన్ కు ప్రతిపక్ష నేత యనమల లేఖ రాశారు. ఎలాంటి ఎడిటింగ్ లేకుండా అన్ని పార్టీల వాదన ప్రజలు వీక్షించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు యనమల. మండలి సభ్యులకు తగినంత భద్రత కల్పించాలని.. శాసన సభ తో సంబంధం లేకుండా మండలి సభ్యులకు ప్రత్యేక మీడియా పాయింట్ ఏర్పాటు చేయాలని కోరారు యనమల.