తమ్ముళ్లలో కన్ఫ్యూజన్..పవన్‌తో వద్దు!

-

పొత్తు విషయంలో కొందరు తెలుగు తమ్ముళ్ళు ఫుల్ కన్ఫ్యూజన్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నారు…ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తు విషయంలో ముదుకొచ్చారు..కాబట్టి ఇక టీడీపీ-జనసేనల పొత్తు ఖాయమని ప్రచారం మొదలైంది. అయితే పొత్తు వల్ల ఇటు టీడీపీకి, అటు జనసేనకు లాభమని చెప్పొచ్చు…ఇక వైసీపీకి పొత్తు వల్ల నష్టమే ఉంటుంది. కాకపోతే ఇక్కడ పొత్తు వల్ల జనసేనకు పూర్తి లాభం ఉండగా, టీడీపీకి కాస్త లాభం,కాస్త నష్టం ఉందని చెప్పొచ్చు.

ముందు లాభం గురించి మాట్లాడుకుంటే…కొన్ని సీట్లలో ఓట్లు చీలిపోకుండా టీడీపీకి ప్లస్ అవుతుంది..కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక నష్టం గురించి వస్తే…ముందు జనసేన కోసం కొన్ని సీట్లు వదులుకోవాలి..ప్రస్తుతం 175 సీట్లలో టీడీపీకి నాయకులు ఉన్నారు..బలమైన క్యాడర్ ఉంది..జనసేనకు మాత్రం అలా లేదు. కాబట్టి జనసేన కోసం కొన్ని సీట్లు టీడీపీ త్యాగం చేయాలి..ఆ సీట్లలో టీడీపీ రాజకీయంగా వెనుకబడే అవకాశాలు ఉన్నాయి.

అలాగే జనసేన ఎక్కువ సీట్లు డిమాండ్ చేయొచ్చు…ఆఖరికి సీఎం సీటు పవన్‌కు ఇవ్వాలని అడుగుతున్నారు..ఇక వారి డిమాండ్లు మరీ అర్ధరహితంగా ఉన్నాయనే వాదన టీడీపీలో వస్తుంది..పైగా పొత్తుతో గెలిస్తే..ఇంకా అధికారంలోకి వచ్చాక..తమ వల్లే అధికారంలోకి వచ్చారని జనసేన శ్రేణులు, నాయకులు డప్పు కొట్టేస్తారని, ఆ తలనొప్పి మనం భరించలేమని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఎలాగో వైసీపీపై ఎక్కువ వ్యతిరేకత ఉందని, కాబట్టి సింగిల్ గా పోటీ చేస్తేనే బెటర్ అని అంటున్నారు.

పైగా పొత్తు పెట్టుకోవడం వల్ల…జగన్‌ని సింగిల్ గా టార్గెట్ చేశారని చెప్పి వైసీపీ నేతలు సానుభూతి లేపే ప్రయత్నం చేస్తారని, ఇప్పటినుంచే వాళ్ళు అదే పనిలో ఉన్నారని…జగన్ ఒంటరిగానే ఫైట్ చేస్తారని చెప్పి సానుభూతి కోణంలో మాట్లాడుతున్నారని అంటున్నారు. ఇదంతా ఉండకూడదు అంటే జనసేనతో పొత్తు లేకుండా సింగిల్ గానే పోటీకి దిగుదామని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. మరి చూడాలి చంద్రబాబు పొత్తుపై ఎలా ఆలోచిస్తారో.

Read more RELATED
Recommended to you

Latest news