ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు…గతానికి భిన్నంగా రాజకీయం నడుపుతున్నారు..పార్టీ బాగు కోసం సొంత పార్టీ నేతలనైనా సరే సైడ్ చేయడానికి వెనుకాడటం లేదు.. సరిగ్గా పనిచేయని నాయకులని ఇంకా ఉపేక్షించడానికి బాబు సిద్ధంగా లేరు.. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పనిచేయని నాయకులని పక్కన పెట్టేసి కొత్తవారికి బాధ్యతలు అప్పగించారు.. అలాగే రానున్న రోజుల్లో ఇంకా ఎవరు సరిగ్గా పనిచేయకపోయినా సరే వారిని సైడ్ చేసేస్తానని చెప్పేస్తున్నారు.
ఇదే క్రమంలో పార్లమెంట్ అధ్యక్షుల విషయంలో కూడా చంద్రబాబు కఠినంగా ఉండేలా ఉన్నారు.. రెండేళ్ల క్రితమే చంద్రబాబు.. జిల్లాల వారీగా ఉన్న అధ్యక్షులని తీసేసి పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని నియమించిన విషయం తెలిసిందే.. 25 స్థానాలకు 25 మంది అధ్యక్షులని పెట్టారు.. అయితే మొదట్లో ఏ అధ్యక్షుడు కూడా దూకుడుగా పనిచేయలేదు.. కానీ బాబు క్లాస్ పీకడంతో నిదానంగా నేతలు పనిచేయడం మొదలుపెట్టారు.
ఇప్పటికే పలు స్థానాల్లో అధ్యక్షులు దూకుడుగా పనిచేస్తున్నారు.. తమ స్థానాల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. ఉదాహరణకు బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు ఏలూరి సాంబశివరావు బాగా దూకుడుగా పనిచేస్తున్నారు.. బాపట్ల పరిధిలో టీడీపీని లీడ్‌లోకి తీసుకొచ్చారు. ఇక ఏలూరి లాగానే కొందరు నేతలు పనిచేస్తున్నారు.. కానీ కొంతమంది పార్లమెంట్ అధ్యక్షులు మాత్రం అంత ఎఫెక్టివ్‌గా పనిచేయడం లేదని టీడీపీ కార్యకర్తలు.. బాబుకు ఫిర్యాదులు చేస్తున్నారు.. వారి వల్ల పార్టీకి ఎలాంటి బెనిఫిట్ లేదని బాబుకు చెబుతున్నట్లు తెలిసింది.. వెంటనే వారిని తప్పించి.. వారి స్థానాల్లో కొత్త అధ్యక్షులని పెట్టాలని తమ్ముళ్ళు కోరుతున్నారు.
ఈ క్రమంలోనే కొంతమంది పార్లమెంట్ అధ్యక్షులని సైడ్ చేయడానికి బాబు సిద్ధమవుతున్నారు.. రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షుడు కేఎస్ జవహర్.. మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణ.. గుంటూరు-తెనాలి శ్రవణ్ కుమార్, నెల్లూరు – అబ్దుల్ అజీజ్, తిరుపతి – నరసింహ యాదవ్, చిత్తూరు – పులివర్తి నాని పనితీరు అంతగా బాగోలేదని తెలుస్తోంది. వీరిని పక్కన పెట్టి కొత్త అధ్యక్షులని పెట్టాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే వీరిని సైడ్ చేయడానికి బాబు రెడీగానే ఉన్నట్లు తెలుస్తోంది.