జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బహిష్కరణ పై టీడీపీ మరో ట్విస్ట్

-

ఆంధ్రప్రదేశ్ టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుందని త్వరలో జరగాల్సిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బహిష్కరణకు టీడీపీ నిర్ణయం తీసుకుందని మీడియాలో కధనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే  టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాత్రం ఈ అంశం మీద ట్విస్ట్ ఇచ్చారు. పరిషత్ ఎన్నికలపై బహిష్కరించాలా !  లేదా అని   ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న ఆయన పాత నోటిఫికేషన్ ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి  పరిషత్ ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు.

రేపు ఎన్నికల కమిషన్ తో జరిగే ఆల్ పార్టీ మీటింగ్ లో కూడా ఇదే డిమాండ్ ను లేవనెత్తుతామని అన్నారు. ఏడాది క్రితం జరిగిన పరిషత్ ఎన్నికల నామినేషన్లలో అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలకు జరిగాయని ఆయన అన్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణయం తర్వాత పరిషత్ ఎన్నికలపై  మా నిర్ణయం ఉంటుందని అన్నారు. బీజేపీ, వైసీపీ కుమ్మక్కయ్యారని అన్నారు. పుదుచ్చేరి కి ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీని.. ఏపీకి ఎందుకివ్వలేదు అని  వైసీపీ ఎంపీలు అడగలేకున్నారని అన్నారు. రాష్ట్రానికి  బిజెపి ఇంత అన్యాయం చేస్తున్నా.. బిజెపి అభ్యర్థి కోసం పుదుచ్చేరిలో వైసిపి నాయకులు ప్రచారం చేశారని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version