కొబ్బరి పాలతో టీ.. వెయిట్ లాస్‌కు స్కిన్‌ గ్లోకు సూపర్‌ రిజల్ట్‌..!

-

బరువు తగ్గాలనుకుంటున్నారా..? ఏవేవో ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయారా..? లోపం పాటించే టిప్స్‌లో లేదు..మీరు చేసే వాటిలో ఉంది. బరువు తగ్గాలి అని చదివే ఆర్టికల్స్‌ను కూడా ఏదో ఒకటి తింటూనే చదువుతారు.. ఇలా ఎప్పుడూ ఏదో ఒకటి నోట్లో నానుతుంటే బరువు ఎలా తగ్గడం. జనరల్‌గా కాఫీ,టీలు తాగితే కెఫిన్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది అనేక రకాలు సమస్యలకు దారితీస్తుంది అంటారు. కానీ టీ. తాగుతూ కూడా ఓ పక్క బరువు తగ్గొచ్చు.. మరోపక్క అందంగా కూడా మారొచ్చు తెలుసా..? గ్రీన్‌ టీ అనుకుంటారేమో అది కాదు కొబ్బరిపాలు టీ.!

కొబ్బరి పాల టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:

కొబ్బరి పాలను గ్రీన్ లేదా బ్లాక్ టీతో కలిపి తయారు చేసిన కెఫిన్ కలిగిన పానీయమే కొబ్బరి టీ. కొబ్బరిని ఎక్కువగా పండించే ఉష్ణమండల ప్రాంతాలలో నివసించే ప్రజలు ఈ పానియాన్ని తయారు చేస్తారు. కొబ్బరి పాలలో మంచి కొవ్వు పుష్కలంగా ఉంటుంది. ఇందులో లారిక్ యాసిడ్, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ మొదలైనవి అధిక స్థాయిలో ఉంటాయి. అందువల్ల కొబ్బరి టీ తాగితే ఆరోగ్యానికి మంచిది. కొబ్బరి పాల టీకి గ్రీన్ టీ బ్యాగ్‌లను కలిపి కూడా తాగొచ్చు.. అందులో పాలీఫెనోలిక్ సమ్మేళనాలు , ఇతర క్రియాశీల పదార్థాలు ఉన్నాయి.

కొబ్బరి పాలలో హైపర్లిపిడెమిక్‌ను సమతుల్యం చేసే మూలకాలు ఉంటాయి. కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వులు. యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ఇది చర్మానికి మేలు చేస్తుంది. చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. కొబ్బరి టీ తాగితే యవ్వనం పెరుగుతుంది. దీర్ఘకాలం పాటు అందాన్ని కాపాడుకోవచ్చు.

బరువు తగ్గాలంటే..

బరువు తగ్గాలని భావివిస్తుంటే.. కొబ్బరి పాల టీ తాగొచ్చు. కొబ్బరి నీళ్లలాగే ఈ టీ కూడా బరువు తగ్గడంలో దోహదపడుతుంది. బరువు పెరగడానికి కారణమయ్యే కొవ్వును నాశనం చేసే గుణాలు కొబ్బరిలో అధికంగా ఉంటాయి. అలాగే ఇందులో ఉండే క్యాలరీలు కూడా చాలా తక్కువ. నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బరువు తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

గుండె ఆరోగ్యానికి..

కొబ్బరిలో ఉండే హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్, లారిక్ యాసిడ్‌లు అధిక రక్తపోటు, కరోనరీ హార్ట్ డిసీజ్ నుండి మిమ్మల్ని రక్షిస్తాయి. అందుకే కొబ్బరి పాలు టీ తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

రోగ నిరోధక శక్తికి..

కొబ్బరి పాల టీ రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. అసలే ఈరోజుల్లో రోగనిరోధక శక్తి ఎంత అవసరమో మనకు బాగా తెలుసు. కొబ్బరి పాలతో చేసిన టీ తాగడం ద్వారా కూడా మీరు రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

ఇన్ని చెప్పారు బానే ఉంది.. ఇంతకీ టీ ఎలా చేసుకోవాలి అనే డౌట్‌ మీకు రావొచ్చు.. కొబ్బరి. పాల టీ ఎలా చేయాలంటే..

కొబ్బరి పాల టీ తయారీ కోసం మీకు 3 గ్రీన్ టీ బ్యాగ్‌లు, 1 కప్పు కొబ్బరి పాలు, 4 కప్పుల నీరు, 2 టేబుల్ స్పూన్ల క్రీమ్, వైట్ లేదా బ్రౌన్ షుగర్ కావాలి.. ముందుగా టీ పాట్‌లో 4 కప్పుల నీటిని మరిగించండి. అందులో గ్రీన్ టీ బ్యాగ్స్ వేయండి. ఇప్పుడు ఒక కప్పు కొబ్బరి పాలు, మీగడ వేసి బాగా మరిగించండి. ఆ తర్వాత కాసేపటికి గ్రీన్ టీ బ్యాగ్‌లను తీయండి. రుచికి తగ్గట్టుగా చక్కెరను వేసి.. బాగా కలపండి. అంతే.. టేస్టీ అండ్ హెల్తీ.. కోకోనట్ మిల్క్ టీ రెడీ.

Read more RELATED
Recommended to you

Latest news