5 టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ మధ్య రాంచీలో జరుగుతున్న టెస్టులో కీపర్ ధ్రువ్ జురెల్ ఇండియాకి గౌరవప్రదమైన స్కోర్ ని అందించడంలో కీలకపాత్ర పోషించారు.టీమ్ ఇండియా తరఫున 90 రన్స్తో ఒంటరి పోరాటం చేసి చివరి వికెట్గా వెనుదిరిగారు కీపర్ ధ్రువ్ జురెల్. అతడిపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించారు. ఇండియా కు మరో ధోనీ దొరికేసినట్లేనని వ్యాఖ్యానించారు. ‘అతడి మానసిక పరిణతి నాకు ధోనీని గుర్తుచేస్తోంది. ఈరోజు సెంచరీ మిస్ అయ్యాడు కానీ ఇదే తీరులో ఆడితే అతడు మున్ముందు చాలా సెంచరీలు చేస్తాడు’ అని కితాబిచ్చారు.
ఇంగ్లండ్తో జరుగుతున్న 4వ టెస్ట్ తొలి ఇన్నింగ్సులో భారత్ 307 రన్సు ఆలౌటైంది. యశశ్వీ జైస్వాల్ 73 పరుగులు చేయగా గిల్ 38, కుల్దీప్ 28, పాటీదార్ 17, సర్ఫరాజ్ 14, జడేజా 12 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బషీర్ 5 వికెట్లతో సత్తా చాటారు. హార్టీ 3, అండర్సన్ 2 వికెట్లు తీశారు. భారత్ మరో 46 రన్స్ వెనుకంజలో ఉంది.