ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో ఓటమిపాలైన భారత్

-

మన దేశంలో జరిగే టెస్ట్ మ్యాచుల్లో టీమిండియా ఓడిపోవడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో కూడా భారత్ పరాజయం పాలైంది. ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం లో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు తొలి సెషన్ కే ముగిసిపోయింది. టీమిండియా టెస్టు చరిత్రలో అత్యంత ఘోర పరాజయాల్లో ఇండోర్ టెస్టు కూడా ఒకటిగా నిలిచిపోతుంది.

ఈ టెస్టులో టర్నింగ్ పాయింట్ ఏమిటన్నది క్రికెట్ దిగ్గజం, వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ తన మాటల్లో చెప్పారు. జడేజా విసిరిన ఓ నోబాల్ కొంపముంచిందని అన్నారు గవాస్కర్. “ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఆడేటప్పుడు మార్నస్ లబుషేన్ బ్యాటింగ్ కు దిగాడు. అతడు ఖాతా తెరవకముందే జడేజా బౌలింగ్ లో అవుటైనా, జడేజా విసిరింది నోబాల్ అని టీవీ అంపైర్ చెప్పాడు . దీంతో మార్నస్ బతికిపోయాడు.

అతడు వ్యక్తిగతంగా 31 పరుగులు చేయడంతో పాటు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఎంతో విలువైన 96 పరుగుల భాగస్వామ్యం చేపట్టాడు. ఇక్కడే మ్యాచ్ లో భారత్ పట్టు కోల్పోయింది. ఆ బంతి గనుక నోబాల్ కాకపోయుంటే లబుషేన్ డక్ అవుటై ఉండేవాడు. అందుకే జడేజా విసిరిన ఆ నోబాల్ టీమిండియా ఓటమికి కారణమైందని చెబుతాను” అని గవాస్కర్ వెల్లడించారు.

ఇండోర్ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే అనూహ్య రీతిలో తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తరువాత ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 197 పరుగులు చేసి కీలక ఆధిక్యాన్ని సంపాదించింది.

రెండో ఇన్నింగ్స్ లోనూ టీమిండియా ఆటతీరు అంతమాత్రంగానే ఉంది. పుజారా అర్ధసెంచరీ సాయంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో కనీసం 163 పరుగులు చేయగలిగింది. ఆసీస్ ముందు 76 పరుగుల స్వల్ప లక్ష్యం నిలవగా… 1 వికెట్ నష్టానికి ఛేదించిన ఆసీస్ ఈ టెస్టులో 9 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news