వచ్చే వారం లాంచ్‌ కానున్న టెక్నో కామోన్ 19 ప్రో మోండ్రియన్ ఎడిషన్..

-

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో తన కొత్త ఫోన్‌ను ఇండియాలో లాంచ్‌ చేయనుంది. అదే టెక్నో కామోన్ 19 ప్రో మోండ్రియన్ ఎడిషన్. 19సిరీస్‌లో భాగంగా ఈ ఫోన్‌ విడుదల కానుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ నాలుగు ఫోన్లులాంచ్‌ అయ్యాయి. ఫోన్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

టెక్నో కామోన్ 19 ప్రో మోండ్రియన్ ఎడిషన్ ధర..

టెక్నో కామోన్ 19 ప్రో మోండ్రియన్ ఎడిషన్ వచ్చే వారం మనదేశంలో లాంచ్ కానుంది.
ఫోన్‌కు వెనకవైపు రంగులను మార్చే ఒక మల్టీ కలర్ ఛేంజింగ్ బ్యాక్.
మనదేశంలో మొట్టమొదటి మల్టీ కోర్ చేంజింగ్ స్మార్ట్ ఫోన్ ఇదే.
ఈ ఫోన్ ధర రూ.20 వేలలోపే ఉండే అవకాశం ఉంది. ఇది 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర.

టెక్నో కామోన్ 19 ప్రో మోండ్రియన్ ఎడిషన్ స్పెసిఫికేషన్లు (అంచనా)

ఈ ఫోన్ ఫీచర్లలో రెగ్యులర్ మోడల్ ఫీచర్లే ఉండే అవకాశం ఉంది. అయితే కేవలం వెనకవైపు మాత్రం రంగులు మార్చనున్నాయి.
టెక్నో కామోన్ 19 ప్రోలో 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్టీపీఎస్ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిజల్యూషన్ 1080 x 2460 పిక్సెల్స్‌గానూ, రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ ఉంది.
మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
మెమొరీ ఫ్యూజన్ టెక్నాలజీ ద్వారా ర్యామ్‌ను 13 జీబీ వరకు పెంచుకోవచ్చు.
గేమింగ్ కోసం మీడియాటెక్ హైపర్ ఇంజిన్ 2.0ను కూడా ఇందులో అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.
33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత హైఓఎస్ 8.6 ఆపరేటింగ్ సిస్టంపై టెక్నో కామోన్ 19 ప్రో 5జీ పనిచేయనుంది.
5జీ, డ్యూయల్ 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 5, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
దీని మందం 0.86 సెంటీమీటర్లుగా ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే…

ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా… దీంతోపాటు 2 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు కూడా అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

-Triveni Buskarowthu 

Read more RELATED
Recommended to you

Latest news