Tees Maar khan: తండ్రికి తగ్గ తనయుడు ఆది సాయి కుమార్..‘తీస్ మార్ ఖాన్’ ట్రైలర్ రిలీజ్

-

టాలీవుడ్ సీనియర్ హీరో సాయికుమార్ నటన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎమోషనల్ సీన్స్ లో సాయి కుమార్ నటనకు ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇక ఆయన డైలాగ్ డెలివరీకి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాగా, ఆయన తనయుడు ఆది సాయి కుమార్ ఈ సారి సాయి కుమార్ మాదిరిగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ తనదైన స్టైల్ లో ప్లే చేశారు.

‘తీస్ మార్ ఖాన్’గా ఆది సాయి కుమార్..త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో ఆదిసాయికుమార్ కు జోడీగా బోల్డ్ బ్యూటీ RX 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్ నటించింది. కల్యాణ్ జీ గోగన దర్శకత్వంలో తెరకెక్కిన వచ్చే నెల 27న విడుదల కానుంది. విజన్ సినిమాస్ బ్యానర్ పై ఈ పిక్చర్ ను నాగం తిరుపతిరెడ్డి ప్రొడ్యూస్ చేశారు. సునీల్, పూర్ణ, కబీర్ దుహాన్ సింగ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ లో ఆది సాయి కుమార్..స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా డిఫరెంట్ వేరియేషన్స్ ను సినిమాలో చూపించబోతున్నారని స్పష్టమవుతోంది. ఓ వైపున తన తండ్రి మాదిరిగా సీరియస్ గా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తూనే..మరో వైపున తన స్టైల్ ఫన్నీ కామెడీ చేసినట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. చూడాలి మరి..ఈ పిక్చర్ తోనైనా ఆది సాయి కుమార్ హిట్ అందుకుంటాడో లేదో..

 

Read more RELATED
Recommended to you

Latest news