ఎక్కడ చూసిన స్త్రీలకు రక్షణ లేకుండా పోతోంది. ప్రతి చోటా స్త్రీలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. అయితే తాజాగా.. మహిళా క్రికెటర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై జాతీయ స్ధాయి కోచ్ నదీం ఇక్బాల్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సస్పెండ్ చేసింది. ముల్తాన్‌లో తాను కొన్నేండ్ల కిందట పీసీబీ మహిళా జట్టులో చోటు దక్కించుకునేందుకు ప్రయత్నించే క్రమంలో జాతీయ కోచ్‌ల్లో ఒకరైన నదీంతో పరిచయం ఏర్పడిందని బాధిత మహిళ ఆరోపించింది. మహిళా జట్టులో తనకు స్ధానం లభించేలా చేస్తానని, ఉద్యోగం వచ్చేలా ప్రయత్నిస్తానని నమ్మబలుకుతూ దగ్గరయ్యాడని తెలిపింది.
ఆపై తనను లైంగిక వేధింపులకు గురిచేయడమే కాకుండా తన ఫ్రెండ్స్‌తోనూ వేధింపులకు గురిచేశాడని ఆరోపించింది. తనను అభ్యంతరకరంగా వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేసేవాడని పేర్కొంది. నదీంపై వచ్చిన ఆరోపణలను పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తారని, అయితే తమ విచారణలో ఆయన కాంట్రాక్టు నిబంధనలను ఉల్లంఘించాడా అనేది పరిశీలిస్తామని ఓ పీసీబీ అధికారి తెలిపారు.