పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి భార్య రాచెల్

-

బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ భార్య రాచెల్ నేడు పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తండ్రి అయిన సంగతి తెలిసిందే. ఆయన భార్య రాచెల్ గోడిన్హో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. తేజస్వికి కుమార్తె పుట్టడంతో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం సంతోషంలో మునిగితేలుతోంది. మరోవైపు చిన్నారికి ‘కాత్యాయని’ అనే పేరు పెట్టారు. ఈ పేరును తన తండ్రి లాలూ ఎంపిక చేశారని తేజస్వి ట్విట్టర్ ద్వారా తెలిపారు.

మరోవైపు మనవరాలు పుట్టిన వెంటనే లాలు, ఆయన భార్య రబ్రీదేవి ఆసుపత్రికి వెళ్లారు. చిన్నారిని ఎత్తుకుని ఎంతో మురిసిపోయారు. ఇంకోవైపు తేజస్వి అన్న తేజ్ ప్రతాప్ యాదవ్ తాను పెదనాన్న అయిన ఆనందంలో మునిగి తేలుతున్నారు. బీహార్ విధానసభ ప్రాంగణంలో ఆయన మిఠాయిలు పంచిపెట్టారు. తేజస్వి యాదవ్ తన బిడ్డకు కాత్యాయని అనే పేరు పెట్టినట్టు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version