బ్రేకింగ్: ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 24 వ తారీకు నుంచి… తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ప్రగతి భవన్ వేదికగా తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ అయిన సంగతి తెలిసిందే.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. అధ్యక్షతన.. తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. అయితే ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఈ కేబినెట్ సమావేశంలో దళిత బంధు పధకం అమలు , కరోనా వ్యాప్తి, రైతుల సమస్యలు, 50 వేల ఉద్యోగాల భర్తీ మరియు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ఏర్పాటు పై కీలక సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఈనెల 24వ తేదీ నుంచి ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయం తీసు కుంది. కరోనా నియమాలు పాటిస్తూ ఈ సమావేశాలను జరిపించాలని నిర్ణయం తీసుకుంది,