డ్రై బ్లూబెర్రీస్ తినటం వల్ల స్త్రీలకు ఎదురయ్యే ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చు..ఇంకా మెమరీకి కూడా బాగా మేలు చేస్తాయట..!

-

స్ట్రాబెర్రీస్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. చూడ్డానికి భలే ఎర్రగా ఉండేసరికి చిన్నపిల్లలు కూడా వీటిని చూసిన వెంటనే కొనమని గోలపెట్టేస్తారు. స్ట్రాబెర్రీస్ లాగానే బ్లూ బెర్రీస్ కూడా మార్కెట్ లో ఫ్రెష్ గా లభిస్తాయి. నగరాల్లోనే ఇవి ఎక్కువగా దొరుకుతాయి. మరికొన్ని ఏరియాల్లో అసలు అందుబాటులో ఉండవు. మనకు ద్రాక్షాలు ఎలాగైతే.. ఎండుద్రాక్ష, ఎండు ఖర్జూరాలు, కిస్ మిస్ లు ఉంటాయో..డ్రై బ్లూ బెర్రీస్ కూడా ఉంటాయి. వీటిని మనం తినగలిగితే..అతి ముఖ్యమైన లాభాలు రెండు పొందవచ్చు.

ఈ బ్లూ బెర్రీస్ ను కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. మెమరీని పెంచుకోవడానికి, ఏకాగ్రత పెంచుకోవడానికి బ్లూ బెర్రీస్ బాగా ఉపయోగపడతాయని సైంటిఫిక్ గా స్టడీ చేసి అమెరికా వారు నిరూపించారు. ఇది తింటే..సుమారుగా 12 వారాల్లోనే మార్పు ఉంటుందని వీళ్లు తెలిపారు. వీటితోపాటు స్త్రీలలో ఎదురయ్యో సమస్య..ఓవరీస్ లో నీటిబుడగలు రావడం..ఇది రాకుండా రక్షించడానికి, డయబెటీస్ బారిన పడుకుండా ఉండటానికి ఈ బ్లూ బెర్రీస్ ఉపయోగపడతాయని సైంటిఫిక్ గా తేలింది. అయితే..ఇవి ఫ్రష్లో ఎలాంటి లాభాలు ఉంటాయి..డ్రై బెర్రీస్ లో ఎలాంటి లాభాలు ఉంటాయి అనేది మనం ఈరోజు చూద్దాం.

100 గ్రాముల ఫ్రష్ బ్లూ బెర్రీస్ లో ఉండే పోషకాలు

వీటిలో ప్యాట్, ప్రొటీన్ ఏం ఉండదు.
కార్బోహైడ్రేట్స్ మాత్రం 14 గ్రాములు
కాలరీలు 57. జామకాయ, యాపిల్ తింటే ఎలాంటి శక్తి వస్తుందో…ఇందులో కూడా అంతే శక్తి ఉంటుంది. అయితే ఫ్రష్ బెర్రీస్ అన్ని ప్రాంతాల్లో దొరకపోవచ్చు. డ్రై బ్లూ బెర్రీస్ మాత్రం సూపర్ మార్కెట్స్ లో ఉంటాయి. వీటి ధర 100 గ్రాములు 210 రూపాయలు ఉంటుంది. కాస్త ఖరీదే.

డ్రై బ్లూ బెర్రీస్ ఉండే పోషకాలు

కాలరీలు 317
కార్భోహైడ్రేట్స్ 67.5 గ్రాములు
ప్రొటీన్ 2.5 గ్రాములు
ఫ్యాట్ 2.4 గ్రాములు
విటమిన్ సీ 24 మిల్లీ గ్రాములు

మరీ ఈ బ్లూ బెర్రీస్ ను కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ను అని ఎందుకు పిలుస్తున్నారంటే..ఏ వెజిటబుల్ లోనూ, ఏ ఫ్రూట్స్ లోనూ లేని విధంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉన్నాయి. మన రక్షణ వ్యవస్థకు, ఇమ్యునిటీ బూస్టింగ్ కి, కణజాలం జబ్బుల బారినపడకుండా రక్షించడానికి ఇందులో యాంతోసైనిన్( Anthocyanin), క్వసటిన్( Quercetin), మైరిసిటిన్( Myricetin), పాలిఫినాల్స్( Polyphenols) ఫైవనాయిడ్స్ ఇవన్నీ ఎక్కువ మోతాదులో ఇందులో ఉండటం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ కానీ, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రాకుండా..మన శరీరంలో విడుదలయ్యే ఫ్రీ రాడికల్స్ ను నిర్మూలించడానికి ఈ యాంటీఆక్సిడెంట్స్ బాగా ఉపయోగపడతాయి. వైరస్ మీద పోరడడానికి కూడా శరీరానికి యాంటీఆక్సిడెంట్స్ కావాలి.

మెమరీ విషయానికి వస్తే..బ్రెయిన్ సెల్స్ కి కార్భైహై‍డ్రేట్స్ త్వరగా వెళ్లి బ్రెయిన్ సెల్స్ వీటిని యూస్ చేసుకునేట్లు ఈ డ్రై బ్లూ బెర్రీస్ బాగా ఉపయోగపడుతున్నాయట. బ్రెయిన్ సెల్స్ త్వరగా అలసిపోకుండా, ఎక్కువగా యాక్టీవ్ గా ఉండటానికి ఈ డ్రై బ్లూ బెర్రీస్ బాగా ఉపయోగడతాయి. హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ ఏమైనా బ్రెయిన్ లో ఉంటే..వాటన్నింటిని నిర్మూలించడం వల్ల బ్రెయిన్ సెల్స్ బాగా షార్ప్ గా యాక్టీవ్ గా ఉంటున్నాయని..దీని వల్ల మెమరీ పెరుగుతుంది..ఏకగ్రత పెరుగుతుందని సైంటిస్టులు తెలిపారు. వీరు 60ఏళ్లు పై బడిన 90 మందిని తీసుకుని వాళ్లకి 12 వారాలపాటు రోజు ఉదయం 50 గ్రాములు ఫ్రష్ బ్లూ బెర్రీస్ ను..ఇచ్చేసరికి వారిలో ఏకాగ్రత పెరిగింది, మెమరీ బాగా పెరిగి, మూడ్ స్వింగ్స్ లేకుండా..మనసు ప్రశాంతంగా ఉండటం ఇవన్నీ ఉన్నట్లు..సైంటిస్టులు గమనించారు. University Of Cincinnati Academic Health Sciences-USA 2010లో నిరూపించారు.

చాలామంది అమ్మాయిలకు ఈరోజుల్లో ఓవరీస్ లో నీటిబుడగలు వస్తున్నాయి..ఒబిసిటీ వల్ల డయాబెటీస్ వస్తుంది. ఈ బ్లూ బెర్రీస్ ను తనిటం వల్ల ఇందులో ఉండే యాంతోసైనిన్స్ ను ఇన్సులిన్ రెస్టిస్టెన్స్ తగ్గించడానికి, ఓవరీస్ లో నీటుబుడగలు రాకుండా బాగా ఉపయోగపడుతున్నాయని పినింగ్ టన్ బైయోమెడికల్ రీసర్చ్ సెంటర్ ( Pennington Biomedical Research Center USA)వారు2010 లో పరిశోధన చేసి ఇచ్చారు.

కాబట్టి ఈ సమస్యలు ఉన్నవారు, రాకుండా ఉండాలనుకునేవారు..దొరికినప్పుడల్లా వీటిని తెచ్చుకుని తినొచ్చు. డ్రై బ్లూబెర్రీస్ అయితే..నానపెట్టుకుని 25గ్రాముల వరకూ ఒక రోజుకు తినొచ్చు. దెబ్బలు, గాయాలు అయినప్పుడు కూడా త్వరగా రీపేర్ చేసుకోవడానికి ఈ బ్లూ బెర్రీస్ బాగా ఉపయోగపడతాయి. చక్కటి ఫలితాలు ఉన్న ఈ బ్లూ బెర్రీస్ ను మంచిగా వాడుకోవాలని ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news