తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం.. 50 వేల పోస్టులపై ప్రకటన!!

-

రెండో రోజు తెలంగాణ కేబినెట్ సమావేశం కాసేపటి క్రితమే ప్రారంభం అయింది. ఈ రోజు కేబినేట్‌ సమావేశంలో ఉద్యోగ ఖాళీల భర్తీకై చేపట్టాల్సిన చర్యలు, ఖాళీల గుర్తింపుపై చర్చ జరుగనుంది. ఈ నేపథ్యంలో కేబినేట్‌ సమావేశానికి అన్ని శాఖల కార్యదర్శులను పూర్తి వివరాలతో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.

cm-kcr
cm-kcr

అన్ని రకాల పోస్టులలో ఖాళీలను గుర్తించిన తర్వాత ప్రతి సంవత్సరం రిక్రూట్ మెంట్ కోసం ‘వార్షిక క్యాలెండర్ ’ తయారు పై ఈ సమావేశంలో చర్చ జరుగనుంది. ప్రతి సంవత్సరం ఖాళీల భర్తీకై.. ‘వార్షిక నియామక కేలెండర్’ (జాబ్ కేలెండర్) ను తయారు చేసి అందుకు అనుగుణంగా విధిగా భర్తీ ప్రక్రియ నిర్వహించాలని భావిస్తోంది ప్రభుత్వం.

అలాగే… రిజిస్ట్రేషన్ ఛార్జ్ ల పెంపు… భూముల విలువ పెంపు పై ఈ రోజు కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. కాగా.. నిన్నటి కేబినేట్‌ భేటీలో పల్లె ప్రగతి, వ్యవసాయం, కృష్ణా జలాలు, మున్సిపాలిటీ అభివృద్ది తదితర అంశాలపై చర్చ జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news