ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తోన్న కరోనా రక్కసి విజృంభణ తెలంగాణలో తగ్గుముఖం పట్టింది. మొన్నటి వరకు భారీగా నమోదైన కరోనా కేసులు ఇప్పుడు తగ్గుతూ వస్తున్నాయి. అయితే.. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. గత కొద్ది రోజులుగా 200 నుంచి 400 లోపే పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. తాజాగా… గత 24 గంటల్లో 252 కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొంది. శనివారం 357, శుక్రవారం 450గా, గురువారం 435 కేసులు రికార్డయ్యాయి.
ఒక్కరోజులో 291 మంది ఆరోగ్యవంతులయ్యారని.. ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి 8, 25, 091 మంది కోలుకున్నారని పేర్కొంది. గత 24 గంటల్లో కరోనా నుంచి ఎవరూ చనిపోలేదని, మరణాల సంఖ్య 4 వేల 111గా ఉందని తెలిపింది. రికవరీ రేటు 99.18 శాతంగా ఉందని, మొత్తం 17 వేల 029 టెస్టులు నిర్వహించడం జరిగిందని పేర్కొంది. ఇదిలా ఉంటే.. వర్షాకాలం కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ కేసులు భారీ నమోదవుతున్నాయి. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వైద్యాశాఖ అధికారులు సూచించారు.