తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చుతోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రాంతాల్లో దీని తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఎవరికి వ్వరు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పనుల నిమిత్తం బయటకి వస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సరే, ఇది మాత్రం రోజురోజుకి పెరుగుతూనే ఉంది. కాగా, గడచిన 24 గంటల్లో 352 కొత్త కేసులు నమోదయ్యాయి. వాటిలో జీహెచ్ఎంసీ పరిధిలోని కేసుల సంఖ్య 302. తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,027కి చేరింది. కరోనా నుంచి కోలుకున్న మరో 230 మందిని డిశ్చార్జి చేశారు. మొత్తమ్మీద 3,301 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 2,531 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా మరో ముగ్గురు మరణించడంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 195కి పెరిగింది.
తెలంగాణలో కరోనా విజృంభణ… కొత్తగా ఎన్ని కేసులంటే..!
-