తెలంగాణలో కొత్తగా ఎన్ని కేసులంటే..!

-

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో దీని ప్రభావం అధికంగా ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 3,227 శాంపిల్స్ పరీక్ష చేయగా 983 మందికి కరోనా నిర్ధారణ అయింది. వారిలో 816 మంది జీహెచ్ఎంసీ పరిధిలోని వాళ్లే.

రంగారెడ్డి జిల్లాలో 47, మంచిర్యాల్ జిల్లాలో 33, మేడ్చెల్ జిల్లాలో 29 కొత్త కేసులు వెల్లడయ్యాయి. కొత్త కేసుల రాకతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,419కి పెరిగింది. ప్రస్తుతం 9 వేల మంది చికిత్స పొందుతుండగా, 5,172 మంది డిశ్చార్జి అయ్యారు. ఇవాళ ఒక్కరోజే 244 మందిని డిశ్చార్జి చేశారు. ఇక, తెలంగాణలో తాజాగా 4 మరణాలు సంభవించాయి. దాంతో కరోనా మృతుల సంఖ్య 247కి పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news